ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఉత్తరాంధ్రపై కరోనా పడగ...కొత్తగా 10 కేసులు నమోదు - ఏపీ కొవిడ్ వార్తలు

ఇన్నాళ్లూ ఉద్ధృతి తక్కువగా ఉన్న ఉత్తరాంధ్రపై కరోనా ఉరుముతోంది. కొత్తగా విశాఖజిల్లాలో 7, విజయనగరం జిల్లాలో 3 కేసులు వెలుగుచూశాయి.

Corona cases are on the rise in north andhra districts.
ఉత్తరాంధ్రపై కరోనా పడగ

By

Published : May 8, 2020, 7:06 AM IST

ఉత్తరాంధ్ర జిల్లాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. విశాఖపట్నం జిల్లాలో ఏడుగురు, విజయనగరం జిల్లాలో ముగ్గురు కొవిడ్‌-19 బారిన పడ్డారు. గురువారం ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో 56 మందికి కొత్తగా వైరస్‌ సోకింది. కేసుల సంఖ్య 1,833కి చేరింది. కృష్ణా, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 38కి పెరిగింది. 51 మంది ఈ వ్యాధి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. దీంతో ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 780కి చేరింది.

ఉత్తరాంధ్రపై కరోనా పడగ

ABOUT THE AUTHOR

...view details