తెలంగాణలో కొత్తగా 609 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి సోకి ముగ్గురు మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటివరకు 2,71,492 కరోనా కేసులు నమోదవ్వగా.. ఇప్పటివరకు 1,465 మంది మరణించారు. కరోనా నుంచి మరో 873 మంది బాధితులు కోలుకున్నారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు 2,61,028 మంది బాధితులు కొవిడ్ నుంచి కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 8,999 కొవిడ్ యాక్టివ్ కేసులుండగా.. 6,922 మంది బాధితులు హోం ఐసోలేషన్లో ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మరో 114 కరోనా కేసులు నమోదయ్యాయి.