తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాకు వచ్చిన వారిలో నలుగురికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయినట్లు కలెక్టర్ అనితా రామచంద్రన్ తెలిపారు. స్వగ్రామాలకు వచ్చిన నలుగురికి కరోనా పాజిటివ్ గుర్తించినట్లు పేర్కొన్నారు.
ఆత్మకూరు(ఎం) మండలంలో 3, సంస్థాన్ నారాయణపురంలో ఒక కేసు నమోదయినట్లు తెలిపారు. కరోనా సోకిన వారి ప్రైమరీ కాంటాక్టులను గుర్తిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.