రాష్ట్రంలో కొవిడ్ మహమ్మారి బారినపడి మరో 19 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 13,807కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 64,461 పరీక్షలు నిర్వహించగా.. 1,321 కేసులు నిర్ధారణ అయ్యాయి.
AP Corona cases today: రాష్ట్రంలో కొత్తగా 1,321 కరోనా కేసులు, 19 మరణాలు - అమరావతి వార్తలు
CORONA BULLETIN
16:55 August 28
CORONA BULLETIN
తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,10,566 మంది వైరస్ బారినపడినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 1,499 మంది బాధితులు కోలుకోవడం ద్వారా వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,81,906కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,853 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,64,71,272 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.
ఇదీ చదవండి:
ఆంగ్లం మోజులో తెలుగును నిర్లక్ష్యం చేయడం తగదు: సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ
Last Updated : Aug 28, 2021, 5:45 PM IST