ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా ఉద్ధృతి.. పది రోజుల్లోనే కేసులు రెట్టింపు!

రాష్ట్రంలో కొత్తగా 71 కరోనా పాజిటివ్ కేసులు
రాష్ట్రంలో కొత్తగా 71 కరోనా పాజిటివ్ కేసులు

By

Published : Apr 30, 2020, 11:13 AM IST

Updated : May 1, 2020, 7:02 AM IST

10:23 April 30

కొవిడ్ కేసులు

కేసుల పెరుగుదల ఇలా

రాష్ట్రంలో గత 10 రోజుల్లోనే కరోనా కేసుల ఉద్ధృతి రెట్టింపు అయ్యింది. గురువారం మరో 71 మందికి వైరస్‌ సోకిందని ప్రభుత్వం ప్రకటించగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 1403కి చేరింది. ఏప్రిల్‌ 20 నాటికి రాష్ట్రంలో మొత్తం కేసులు 722 కాగా 10 రోజుల్లోనే ఈ సంఖ్య 1403కి చేరింది. రాష్ట్రంలో ఇంతవరకూ నమోదైన మొత్తం కేసుల్లో ఈ పది రోజుల్లో తేలినవే దాదాపు సగం ఉన్నాయి. నిన్న కొత్తగా నమోదైన కేసుల్లో కర్నూలులోనే 43 ఉన్నాయి. కృష్ణాలో 10 మరో 6 జిల్లాల్లో 18 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్య పెరగగా అందుకనుగుణంగానే కేసుల విస్తృతి ఎక్కువవుతోంది. ఏప్రిల్‌ 20 నాటికి 30వేల 773 మందికి పరీక్షలు నిర్వహించగా ప్రస్తుతం వాటి సంఖ్య దాదాపు లక్షకు చేరువవుతోంది. కొత్తగా మరో 34 మంది వైరస్‌ నుంచి కోలుకొని ఇళ్లకు చేరుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

కర్నూలు జిల్లాలో

కర్నూలు జిల్లాలో రాష్ట్రంలో మరెక్కడా లేని రీతిలో కరోనా విజృంభిస్తోంది. ప్రతి రోజూ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. గురువారం ఒక్కరోజే 43 మందికి వైరస్ సోకింది. ఏప్రిల్ 18 నాటికి జిల్లాలో 132 కేసులు నమోదయ్యాయి. అప్పట్నుంచీ ఏప్రిల్ 30 వరకూ కేవలం 12 రోజుల వ్యవధిలో మరో 254 మంది వైరస్‌ బారిన పడ్డారు. ప్రస్తుతం జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 386కు చేరింది. వారిలో 9మంది మరణించగా 43 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 334 మంది కొవిడ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీటిలో కర్నూలు నగరంలో అత్యధికంగా 231, నంద్యాలలో 73 మంది బాధితులు ఉన్నారు. దిల్లీ నుంచి వచ్చిన వారితో జిల్లాలో వైరస్‌ వ్యాప్తి ప్రారంభమైంది. ఓ ప్రముఖ వైద్యుడి మరణం తర్వాత కూడా పలువురికి వైరస్‌ సోకినట్లు గుర్తించారు. కరోనా వ్యాప్తిని నివారించలేకపోవడంపై కలెక్టర్ వీరపాండియన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబుపై బదిలీ వేటు పడింది.

గుంటూరు జిల్లాలో

గుంటూరు జిల్లాలో మరో నలుగురుకి వైరస్‌ సోకగా కేసుల సంఖ్య 287కి చేరింది. గత రెండ్రోజుల్లో 46 కేసులు నమోదు కాగా గురువారం తగ్గుముఖం పట్టడం కాస్త ఉపశమనం కలిగించింది. మరిన్ని వైరస్‌ నిర్ధారణ పరీక్షల ఫలితాలు పెండింగ్‌లో ఉన్నందున ఉత్కంఠ నెలకొంది. నరసరావుపేటలో తీవ్రత దృష్ట్యా 2 రోజుల సంపూర్ణ లాక్‌డౌన్‌ను మరో 3 రోజులు పొడిగించారు. రెడ్ జోన్ ప్రాంతాల్లో స్వయంగా కలియతిరిగిన జిల్లా కలెక్టర్‌ ప్రజలకు మైక్ ద్వారా జాగ్రత్తలు చెప్పారు. వరవకట్ట ప్రాంతంలోనే 81 కేసులు నమోదైనందున అవసరమైతే సంపూర్ణ లాక్ డౌన్ మరింత పొడిగిస్తామన్నారు.

చిత్తూరు జిల్లాలో

చిత్తూరు జిల్లాలో వరుస కేసులు నమోదవుతున్న శ్రీకాళహస్తిలో పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. జిల్లాలో కొత్తగా మరో ముగ్గురు వైరస్‌కు గురి కాగా అందులో 2 కేసులు శ్రీకాళహస్తిలో గుర్తించారు. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 80కి చేరగా.. శ్రీకాళహస్తిలోనే 49 నమోదయ్యాయి. శ్రీకాళహస్తిని పూర్తిగా రెడ్ జోన్‌గా ప్రకటించి ప్రతి 6 గంటలకు ఓసారి పారిశుద్ధ్యం పనులు నిర్వహిస్తున్నారు. 



 
ఇదీ చదవండి:'చేయి తడపండి.. ముందుకెళ్లండి'


 

Last Updated : May 1, 2020, 7:02 AM IST

ABOUT THE AUTHOR

...view details