తెలంగాణలో ఇవాళ 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మెుత్తం కేసుల సంఖ్య 970కి చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలో 13, జోగులాంబ గద్వాల జిల్లాలో 10 కేసులు నమోదయ్యాయి. ఇవాళ వివిధ ఆసుపత్రుల నుంచి 58 మంది డిశ్చార్జి అయినట్లు మంత్రి వెల్లడించారు. తెలంగాణలో కరోనా మృతుల సంఖ్య 25కి చేరింది.
తెలంగాణలో కొత్తగా 27 కరోనా పాజిటివ్ కేసులు
తెలంగాణలో మరో 27 కరోనా పాజిటివ్ కేసులు
18:42 April 23
హైదరాబాద్లో 13 కొత్త కేసులు
టెస్టులకు ఇబ్బంది లేదు
తెలంగాణలో కరోనా టెస్టులకు ఎలాంటి ఇబ్బంది లేదని మంత్రి ఈటల తెలిపారు. 9 ల్యాబ్లు అందుబాటులోకి వచ్చినట్లు చెప్పారు.
ఇదీ చూడండి..
Last Updated : Apr 23, 2020, 8:00 PM IST