కరోనా వైరస్‌తో ఇబ్బంది పడుతున్న అమెరికాలోని ప్రవాసాంధ్రులకు భరోసా ఇస్తూ సీఎం జగన్ ప్రకటన న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్‌లో ప్రదర్శించారు. ప్రవాసాంధ్రుల్లో మనోధైర్యం నింపుతూ సీఎం వీడియో సందేశాన్ని అక్కడ ప్రదర్శించారు. అమెరికాలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రత్నాకర్ పండుగాయల ఈ సందేశాన్ని ఏర్పాటు చేశారు. 'అమెరికాలోని ప్రవాసాంధ్రులంతా సురక్షితంగా ఉండండి.. ఏపీలోని మీ ఆప్తుల రక్షణ బాధ్యతలు ఏపీ ప్రభుత్వం తీసుకుంటుంది' అంటూ జగన్ సందేశం ఉంచారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టైమ్ స్క్వేర్‌లో ప్రజలకు మనోధైర్యాన్ని ఇచ్చే సందేశం ఏర్పాటు చేయడం చరిత్రలో ఇదే తొలిసారని ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రత్నాకర్ తెలిపారు. అమెరికాలో ఉన్న ప్రవాసాంధ్రులు రాష్ట్రంలోని తమ వారి గురించి ఆందోళన చెందకుండా ఉండేందుకు సీఎం సందేశం అక్కడ ప్రదర్శించినట్టు ఆయన వెల్లడించారు.
న్యూయార్క్ టైమ్ స్క్వేర్‌లో సీఎం జగన్ సందేశం - latest news on corona in ap
కరోనాపై ప్రవాసాంధ్రుల్లో ధైర్యం నింపుతూ న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్‌లో సీఎం జగన్ వీడియో సందేశాన్ని ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రత్నాకర్ పండుగాయల ఈ సందేశాన్ని ఏర్పాటు చేశారు.

న్యూయార్క్ టైమ్ స్క్వేర్‌లో.. సీఎం జగన్ సందేశం
న్యూయార్క్ టైమ్ స్క్వేర్‌లో.. సీఎం జగన్ సందేశం
ఇదీ చదవండి: రాష్ట్రంలో పెరుగుతోన్న కరోనా పాజిటివ్ కేసులు