ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

HYDROGEL : కంటి చూపును రక్షించేలా... ఐఐటీ ఆవిష్కరణ! - Andhra Pradesh News

కంటికి గాయమై కార్నియా దెబ్బతింటే.. సాధారణంగా శస్త్రచికిత్స ద్వారా దాన్ని పూర్తిగా లేదు కొంతమేర మార్పిడి చేస్తారు. కానీ.. ఇలాంటివేం అవసరం లేకుండా దెబ్బతిన్న కార్నియాను బాగు చేసి కంటిచూపును రక్షించేలా ఐఐటీ హైదరాబాద్ పరిశోధకులు సరికొత్త ఆవిష్కరణ(HYDROGEL) చేశారు.

HYDROGEL
కంటి చూపును రక్షించేలా... ఐఐటీ ఆవిష్కరణ!

By

Published : Sep 30, 2021, 12:19 PM IST

కంటికి ఏదైనా గాయమైతే కార్నియా దెబ్బతిని చూపు పోయే ప్రమాదముంటుంది. ఇలాంటి సమస్య తలెత్తినప్పుడు కార్నియాను పూర్తిగా లేదా కొంత మేర మార్పిడి చేయాల్సి ఉంటుంది. ఇందుకు శస్త్రచికిత్సలూ అవసరమవుతాయి. ఇలాంటివేవీ లేకుండానే దెబ్బతిన్న కార్నియాను బాగు చేసి కంటిచూపును రక్షించేలా ఐఐటీ హైదరాబాద్‌ పరిశోధకులు సరికొత్త ఆవిష్కరణ(HYDROGEL) చేశారు.

మనుషులు, జంతువుల నుంచి సేకరించిన కార్నియాలతో వీరు డీసెల్యులరైజ్డ్‌ కార్నియా మాట్రిక్స్‌ హైడ్రోజెల్‌(HYDROGEL)ను సిద్ధం చేశారు. కంటికి దెబ్బతగిలిన వెంటనే దీనిని ఉపయోగించడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. ఐఐటీలోని బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో సహ ఆచార్యుడు డాక్టర్‌ ఫల్గుణిపతి, ఆయన బృందం ఈ ఘనత సాధించింది. ఈ పరిశోధనలో ఎల్వీప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌కి చెందిన సీనియర్‌ శాస్త్రవేత్త వివేక్‌సింగ్‌ కీలకంగా ఉన్నారు. ఈ హైడ్రోజెల్‌(HYDROGEL)ను ఉపయోగించి వీరు త్రీడీ బయోప్రింటింగ్‌ విధానంలో కృత్రిమ కార్నియానూ రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ చికిత్స పద్ధతిపై చాలా పరీక్షలు పూర్తయ్యాయని, త్వరలోనే మనుషులపైనా కొన్ని పైలట్‌ స్టడీస్‌ చేయనున్నట్లు పరిశోధక విద్యార్థి శిబు వివరించారు. ఈ మేరకు ఐఐటీ వర్గాలు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశాయి.

ఇటీవలే.. రెటినిటిస్ పిగ్మెంటోసా అనే వ్యాధి కారణంగా 40 ఏళ్ల క్రితం చూపు కోల్పోయిన ఓ వ్యక్తిపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు..ఒక కంటికి జీన్ థెరపీ చేసి... క్రిమ్సన్ అనే ఆల్గే జన్యువును కంటిలోని రెటీనాకు జత చేశారు. క్రిమ్సన్ అనేది ఏకకణ జీవికి చెందిన జన్యువు. వీటికి సూర్యరశ్మిని గ్రహించే గుణం ఉంటుంది. దీని ద్వారా చూపు మళ్లీ తిరిగి తీసుకొచ్చారు పరిశోధకులు.

ABOUT THE AUTHOR

...view details