CONTRUCT OUTSOURCING EMPLOYEES: పీఆర్సీ అమలులో భాగంగా ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులకు వేతన సవరణకు సంబంధించి ప్రభుత్వం వేర్వేరు ఉత్తర్వులను జారీ చేసింది. కేటగిరీల వారీగా పొరుగు సేవల ఉద్యోగులకు స్వల్పంగా వేతనాలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొదటి కేటగిరీలోని సీనియర్ అసిస్టెంట్, స్టెనో, అకౌంటెట్ , డీపీవో లకు 21 వేల 500లకు వేతనాన్ని పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు. రెండో కేటగిరీలోని డ్రైవర్, జూనియర్ అసిస్టెంట్ టైపిస్టు తదితర ఉద్యోగుల వేతనం 18 వేల 500గా నిర్ధారించారు. ఇక మూడో కేటగిరీలోని ఆఫీస్ సబార్డినేట్ , దఫేదార్ తదితర ఉద్యోగులకు 15 వేలుగా వేతనాన్ని ఖరారు చేస్తూ ఆర్థికశాఖ ఆదేశాలు ఇచ్చింది.
CONTRUCT OUTSOURCING EMPLOYEES: పొరుగుసేవల ఉద్యోగుల వేతనాల పెంపు - contract outsourcing employees salaries increased
CONTRUCT OUTSOURCING EMPLOYEES: పీఆర్సీ అమలులో భాగంగా ఒప్పంద , పొరుగు సేవల ఉద్యోగులకు వేతన సవరణకు సంబంధించి ప్రభుత్వం వేర్వేరు ఉత్తర్వులను జారీ చేసింది. కేటగిరీల వారీగా పొరుగు సేవల ఉద్యోగులకు స్వల్పంగా వేతనాలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇక రాష్ట్రంలో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులకు మినిమమ్ టైమ్ స్కేలు అమలును పొడిగిస్తూ ఉత్తర్వులు ప్రభుత్వం మరో ఉత్తర్వును జారీ చేసింది. 2022 పీఆర్సీ నివేదిక మేరకు జనవరి 1 తేదీ నుంచి ఒప్పంద ఉద్యోగులకు 2022 మినిమమ్ టైమ్ స్కేలు వేతనం వర్తింప చేయనున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ విభాగాలు, విశ్వవిద్యాలయాలు, సంస్థలు, కేజీబీవి, మోడల్ పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని ప్రభుత్వం పేర్కొంది.
ఇదీ చదవండి:
DGP: సైబర్ నేరాల కట్టడికి పటిష్ఠ వ్యూహం: డీజీపీ గౌతంసవాంగ్
TAGGED:
PRC LATEST NEWS