ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ యాక్ట్ 2020 సెక్షన్ 12ను సవాల్ చేస్తూ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిపింది. ఎక్సైజ్ టాక్స్‌ను ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు తరలించేందుకు అవకాశం కల్పించే సెక్షన్ 12 రాజ్యాంగ విరుద్ధమని.. పిటిషనర్ తరఫు న్యాయవాది యలమంజుల బాలాజీ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. కార్పొరేషన్‌కు అప్పు చెల్లించే స్తోమత లేకపోయినా ప్రభుత్వం ఆస్తులివ్వటం.. ప్రజల జీవించే హక్కుకి విరుద్ధమని న్యాయవాది తెలిపారు.
మరోవైపు.. పిటిషనర్ అభ్యంతరాలను అంగీకరిస్తే కార్పొరేషన్ కు వచ్చే అప్పులు ఆగిపోతాయని ప్రభుత్వం తరఫు న్యాయవాది, సుప్రీం కోర్టు లాయర్ దుష్యంత్ దవే చెప్పారు. ఈ విషయమై కౌంటర్ దాఖలు చేస్తామన్నారు. ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలని కోరారు. నగదును కన్సాలిడేటెట్ ఫండ్ లో వేస్తామని చెప్పారు. ఈ వ్యవహారానికి సంబంధించి.. ఇరు పక్షాల న్యాయవాదులు.. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను ఉదహరించారు.
ఇరువురి వాదనలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం.. ఆ జడ్జిమెంట్ ప్రతులను తమ ముందుకు తీసుకురావాలని న్యాయవాదులను ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.
అసలేం జరిగింది!