సాంకేతిక కారణాలతో ఎస్బీఐ(State Bank of India) ఏటీఎం నుంచి డబ్బు రాకపోయినా 15 రోజుల తరువాత ఆ మొత్తాన్ని ఖాతా నుంచి బ్యాంకు డెబిట్ చేయడాన్ని తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల కమిషన్(Telangana State Consumer Commission) తప్పుబట్టింది. ఏటీఎం నుంచి విత్‌డ్రా చేసినట్లుగా ఖాతా నుంచి ఉపసంహరించిన రూ.10 వేలను 2017 జనవరి నుంచి 9 శాతం వడ్డీతోపాటు పరిహారంగా రూ.15 వేలు, ఖర్చుల కింద మరో 5 వేలు ఖాతాదారు యు.సర్వోత్తమరెడ్డికి చెల్లించాలని తీర్పు చెప్పింది.
Telangana State Consumer Commission : ఎస్‌బీఐకి రాష్ట్ర వినియోగదారుల కమిషన్ షాక్ - స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
సాంకేతిక కారణాలతో ఎస్బీఐ(State Bank of India) ఏటీఎం నుంచి డబ్బు రాకపోయినా నగదు డెబిట్ కావడంపై ఓ వ్యక్తి తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల కమిషన్(Telangana State Consumer Commission)ను ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కమిషన్.. బాధితుడికి డెబిట్ అయిన నగదు రూ.10 వేలను 9 శాతం వడ్డీతో పాటు పరిహారంగా రూ.15 వేలు, ఖర్చుల కింద మరో 5 వేలు చెల్లించాలని తీర్పు ఇచ్చింది.
హైదరాబాద్‌కు చెందిన సర్వోత్తమరెడ్డికి కర్నూలు జిల్లా గడివేముల మండలం ఎస్‌బీఐ(State Bank of India)లో పొదుపు ఖాతా ఉంది. 2017 జనవరి 26, 27 తేదీల్లో హైదరాబాద్‌లోని ఏటీఎం నుంచి రూ.10 వేలు తీయడానికి ప్రయత్నించగా నగదురాలేదు. ఫిబ్రవరి 15న ఈ మొత్తాన్ని ఖాతా నుంచి బ్యాంకు(State Bank of India) డెబిట్ చేయడంతో ఫిర్యాదు చేసినా ఫలితం లేక జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. దీనిపై రూ.10 వేలను 8 శాతం వడ్డీతోపాటు పరిహారంగా రూ.90 వేలు చెల్లించాలని జిల్లా ఫోరం తీర్పునిచ్చింది. దీనిపై ఎస్‌బీఐ(State Bank of India) రాష్ట్ర వినియోగదారుల కమిషన్(Telangana State Consumer Commission)లో అప్పీలు వేసింది. కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ ఎం.ఎస్.కె.జైశ్వాల్ విచారణ చేపట్టారు జిల్లా వినియోగదారుల ఫోరం తీర్పును సవరించి పరిహారం చెల్లించాల్సిందేనంటూ తీర్పిచ్చారు.
ఇదీ చదవండి:PYTHON HULCHAL: రాత్రంతా చుక్కలు చూపించిన కొండచిలువ..