రాజధాని అమరావతిలో పనులు ప్రారంభమయ్యాయి. రాయపూడిలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస గృహాల్లో మిగిలిపోయిన పనులను పూర్తి చేసేందుకు.. అధికారులు చర్యలు చేపట్టారు. గతంలో ఈ భవనాలను నిర్మించిన ఎన్సీసీ సంస్థకే.. నిర్మాణ పనులను అప్పగించారు. శాసనసభ్యుల నివాసాల్లో టైల్స్, నీటి పైపులు, విద్యుత్ కార్మికులు పనుల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే నిర్మాణ సామాగ్రిని రాయపూడికి తరలించారు. సోమవారం నుంచి భారీస్థాయిలో మరింత మంది కూలీలు రానున్నారని నిర్మాణ సంస్థ అధికారులు తెలిపారు. వీలైనంత త్వరగా పనలు పూర్తిచేసి ప్రభుత్వానికి అప్పగిస్తామని చెప్పారు.
Amaravathi Capital: రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు ప్రారంభం - రాజధాని అమరావతి పనులు
హైకోర్టు ఆదేశాల మేరకు రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాసాలలో పనులు ప్రారంభించారు. పనులు చేసేందుకు వచ్చిన కూలీలకు అమరావతి రైతులు గులాబీలు ఇచ్చి స్వాగతం పలికారు.
రాజధాని అమరావతిలో ప్రారంభమైన నిర్మాణ పనులు
మరోవైపు పనులకు వచ్చిన కార్మికులకు రాజధాని రైతులు గులాబీ పూలు ఇచ్చి స్వాగతం పలికారు. మళ్లీ అమరావతి పనులు చేసేందుకు వచ్చిన కూలీలను అభినందించారు. ప్లాట్లను కూడా త్వరగా అభివృద్ధి చేసి అప్పగించాలని రైతులు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: Amaravati Victory: అమరావతికి అనుకూలంగా తీర్పు.. ఫలించిన రైతుల పోరాటం