తెలంగాణ వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. హన్మకొండలోని కమిషనరేట్‌లో కానిస్టేబుల్ హైమద్ పాషా.. పురుగుల మందు తాగారు. అపస్మారక స్థితిలో పడిపోయిన కానిస్టేబుల్‌ను తోటి పోలీసులు చూసి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
తెలంగాణ: పురుగుల మందు తాగి కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం - warangal Constable commits suicide news
తెలంగాణ వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. బదిలీ విషయం కారణంగానే బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని సమాచారం.
![తెలంగాణ: పురుగుల మందు తాగి కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం Constable commits suicide by drinking pesticide in warangal commissionerate](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11069427-340-11069427-1616131136507.jpg)
పురుగుల మందు తాగి కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
ప్రస్తుతం హన్మకొండలో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ హైమద్ను జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు బదిలీ చేశారు. ఈ కారణంగానే మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం.