వేసవిలో రాష్ట్రంలోని 8,242 ఆవాస ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడిని గుర్తించామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఇందులో 2,837 ఆవాసాల్లోని 17.68 లక్షల మంది ప్రజలకు ట్యాంకర్ల ద్వారా రోజుకు 13,488 ట్రిప్పుల తాగునీరు సరఫరా చేస్తున్నామని వివరించారు. రూ.204.77 కోట్లతో వేసవి తాగునీటి ప్రణాళిక రూపొందించామని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. దీనిలో భాగంగా రూ.5.80 కోట్లతో 2,440 బోర్లకు ఫ్లషింగ్, 968 బోర్లను మరింత లోతు చేయడం, 325 తాగునీటి జలాశయాల్లో పూడికతీత పనులు చేపట్టామన్నారు. రూ.20.19 కోట్లతో చిత్తూరు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లోని 2,055 ఆవాస ప్రాంతాల పరిధిలో పశువులకు తాగునీటిని సరఫరా చేస్తున్నామని మంత్రి వివరించారు.
రూ.204 కోట్లతో తాగునీటి ప్రణాళిక : మంత్రి పెద్దిరెడ్డి - drinking water problem in summer
వేసవిలో తాగునీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకొని రూ. 204.77 కోట్లతో ప్రణాళిక రూపొందించామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి