ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రైవేటీకరణ వద్దంటూ.. ప్రత్యేక హోదా కోరుతూ.. దిల్లీలో ఏపీ కాంగ్రెస్ నిరసన

విశాఖ ఉక్కు అంశంపై దిల్లీలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టారు. దిల్లీలోని ఏపీ భవన్ వద్ద నిరసనకు దిగారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకించారు. రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు.

congress protest at dehi
congress protest at dehi

By

Published : Mar 13, 2021, 11:19 AM IST

Updated : Mar 13, 2021, 12:59 PM IST

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు దిల్లీలో ధర్నాకు దిగారు. దిల్లీలోని ఏపీ భవన్‌ వద్ద ఆందోళన చేపట్టారు. పీసీపీ అధ్యక్షుడు శైలజానాథ్‌ నేతృత్వంలో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద బైఠాయించారు.

'విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు' అంటూ నినదించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరారు.

విశాఖ ఉక్కు ఆంధ్రలహక్కు అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. రాష్ట్రానికి కేంద్రం అడుగడుగునా అన్యాయం చేస్తోందని శైలజానాథ్‌ మండిపడ్డారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీపై సీఎం జగన్‌ ఎందుకు మౌనంగా ఉంటున్నారని పశ్నించారు

విశాఖ ఉక్కు అంశంపై దిల్లీలో ఏపీ కాంగ్రెస్ ధర్నా

ఇదీ చదవండి:

'విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాల్సిన అవసరం లేదు'

Last Updated : Mar 13, 2021, 12:59 PM IST

ABOUT THE AUTHOR

...view details