ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'హామీలు తుంగలో తొక్కారు... విశాఖ ఉక్కును అమ్మకానికి పెట్టారు' - భాజపాపై తులసిరెడ్డి మండిపాటు

కేంద్రప్రభుత్వంపై ఏపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు తులసిరెడ్డి విమర్శలు గుప్పించారు. భాజపా పాలనలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. విభజన హామీలను తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు. విశాఖ ఉక్కును అమ్మకానికి పెడతారా..? అని నిలదీశారు.

Congress PCC Working president Tulasireddy
పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు తులసిరెడ్డి

By

Published : Feb 4, 2021, 4:33 PM IST

భాజపా పాలనలో రాష్ట్రానికి అడుగడుగునా.... అన్యాయం జరుగుతోందని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి విమర్శించారు. ఆంధ్ర అనే పేరు లేకుండా... ఆంధ్రాబ్యాంకును యూనియన్‌ బ్యాంకులో విలీనం చేశారన్నారు. విభజన హామీలను కేంద్రం తుంగలో తొక్కిందని ధ్వజమెత్తారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని సాధించుకున్న... ఉక్కు కార్మగారాన్ని అమ్మకానికి పెట్టడమేంటని నిలదీశారు. ఆంధ్రుల కోపాగ్నికి భాజపా పతనమైపోతోందని... హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details