తెలంగాణలోని హుజూరాబాద్ ఉపఎన్నికకు కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు అభ్యర్థి(huzurabad congress candidate)ని ఖరారు చేసింది. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బల్మూరి వెంకటనర్సింగ్ రావును హుజూరాబాద్ అభ్యర్థి(huzurabad congress candidate)గా అధిష్ఠానం ప్రకటించింది.
యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి తిప్పరపు సంపత్, కిసాన్ కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు పత్తి కృష్ణారెడ్డి, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్.. పేర్లను పార్టీ నాయకత్వం పరిశీలించింది. చివరగా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బల్మూరి వెంకటనర్సింగ్ రావును ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది.