జమ్ముకశ్మీర్ కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్370రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై లోక్సభలో వాడీ వేడి చర్చ జరిగింది.ప్రత్యేక పరిస్థితుల్లో జమ్ము-కశ్మీర్ భారత్‌లో విలీనమైందని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ అన్నారు.సభ ముందుకు వచ్చిన ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమన్నారు.ఏపీ,తెలంగాణ విభజన సమయంలో అక్కడి శాసనసభను సంప్రదించే కాంగ్రెస్ విభజన చేసిందని గుర్తు చేశారుమనీష్ తివారీ
ఇప్పుడు జమ్ము-కశ్మీర్‌లో శాసనసభ లేదు..రాష్ట్రపతి పాలన కొనసాగుతోందన్నారు.ఇలాంటి సమయంలో ఆ రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టడం రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు.అలాగే హైదరాబాద్ సంస్థానాన్ని సైనిక చర్య ద్వారా సర్దార్ పటేల్ భారత్‌లో అంతర్భాగం చేశారని...ఈ ప్రక్రియ అంతా రాజ్యాంగ విరుద్ధంగా చేస్తున్నారనేదే తమ ప్రశ్న అని తెలిపారు.