తెలంగాణ రాష్ట్రంలో జరిగిన హుజూరాబాద్ ఉపఎన్నిక ఓటమి (Huzurabad By Poll Result)పై ఏఐసీసీ ఆత్మపరిశీలన చేపట్టింది. కేసీ వేణుగోపాల్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో దిల్లీలో సమీక్షిస్తున్నారు. ఏఐసీసీ పిలుపుతో టికాంగ్రెస్ నేతలు దిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూర్ వెంకట్‌తో పాటు 13 మంది నేతలు ఏఐసీసీ పెద్దలతో భేటీ అయ్యారు. హుజూరాబాద్‌లో ఓటమి (Huzurabad By Poll Result)పై నేతలు వివరణ ఇవ్వనున్నారు.
రేవంత్‌పై ఆగ్రహం..
హుజూరాబాద్‌లో ఓటమి (Huzurabad By Poll Result)పై ఇప్పటికే టిపీసీసీ అధిష్ఠానికి నివేదిక పంపించింది. టిపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి సారథ్యంలో తొలి ఓటమి (Huzurabad By Poll Result) నమోదైంది. వెంకట్ డిపాజిట్ కోల్పోవడంతో పాటు.. కేవలం 3 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ పరిణామాలపై తీవ్రంగా స్పందించిన కాంగ్రెస్ నేతలు టిపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌పై మండిపడ్డారు. ఇందిరా గాంధీ హయాం నుంచి ఉన్న సంప్రదాయ ఓట్లు ఎటు వెళ్లాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ పూర్తిగా కనుమరుగైందనుకున్న ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇంతకంటే ఎక్కువ ఓట్లు వచ్చాయన్నారు. బద్వేల్ ఉపఎన్నికలో 6వేల ఓట్లు వచ్చాయని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు భాజపాకు బదిలీ అయినట్లు సీనియర్ల ఫిర్యాదు చేశారు. ఈటలకు బదలాయింపుపై సమావేశంలో చర్చిస్తున్నారు. సీనియర్ల ఫిర్యాదుతో తెలంగాణ రాష్ట్ర నాయకత్వంపై అధిష్ఠానం ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో (Huzurabad By Poll Result) ఏం జరిగిందో వివరణ తీసుకోవాలని సోనియా ఆదేశించినట్లు సమాచారం. ఓట్లు తగ్గడానికి కారణాలు, తీసుకున్న వ్యూహాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. మండలాల ఇన్‌ఛార్జుల నుంచి వేణుగోపాల్ సమాచారం సేకరించనున్నారు. రేవంత్ నాయకత్వంపై సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.