ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: ముఖ్యమంత్రి కేసీఆర్​తో కాంగ్రెస్ నేతల భేటీ - Pragathi bhavan news

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR)​ను కాంగ్రెస్ నేతలు ప్రగతిభవన్‌లో కలిశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Clp Bhatti vikramarka), శ్రీధర్‌బాబు, రాజగోపాల్‌రెడ్డి, జగ్గారెడ్డి.. ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. యాదాద్రి జిల్లా అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్‌లో కస్టోడియల్‌ డెత్‌పై ఫిర్యాదు చేశారు.

తెలంగాణ : ముఖ్యమంత్రి కేసీఆర్​(cm kcr)తో కాంగ్రెస్ నేతల భేటీ
తెలంగాణ : ముఖ్యమంత్రి కేసీఆర్​(cm kcr)తో కాంగ్రెస్ నేతల భేటీ

By

Published : Jun 25, 2021, 5:54 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR)​ను కాంగ్రెస్ నేతలు ప్రగతిభవన్‌లో కలిశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Clp Bhatti vikramarka), శ్రీధర్‌బాబు, రాజగోపాల్‌రెడ్డి, జగ్గారెడ్డి.. ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. యాదాద్రి జిల్లా అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్‌లో కస్టోడియల్‌ డెత్‌పై ఫిర్యాదు చేశారు.

మరియమ్మ మృతిపై తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ నేతలు (CM KCRకు) విజ్ఞప్తి చేశారు. ఎస్సీలు, గిరిజనులపై దాడులు, ఇతర అంశాలపై చర్చించారు.

ఇదీ జరిగింది...

యాదాద్రి భువనగిరి జిల్లా గోవిందాపురం చర్చి ఫాదర్​ బాలశౌరి నివాసంలో ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోనట్లగూడకు చెందిన అంబడిపూడి మరియమ్మ (Mariyamma) వంట చేసేందుకు రెండు నెలల క్రితం చేరింది. ఇంట్లో రూ. 2 లక్షలు దొంగతనం జరిగిందని చర్చి ఫాదర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫాదర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అడ్డగూడురు పోలీసులు ముందుగా మరియమ్మ కుమారుడు ఉదయ్​కిరణ్, అతడి స్నేహితుడు వేముల శంకర్​ను స్టేషన్​కు పిలిపించి తమదైన శైలిలో ప్రశ్నించడంతో... రూ.1.35 లక్షలను వారి ద్వారా రికవరీ చేసినట్లు పోలీసులు చెప్పారు.

మిగిలిన రూ.65వేల కోసం ఈనెల 18న మరియమ్మ (Mariyamma)ను పిలిపించి ప్రశ్నించగా ఆమె స్పృహతప్పి పడిపోయిందని... భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఇదే సమయంలో విషయం బయటకు పొక్కకుండా సాయంత్రం వరకు గోప్యంగా ఉంచడంతో పలు అనుమానాలకు దారితీసింది. పోలీసులు కొట్ట‌డంతోనే మ‌రియ‌మ్మ చ‌నిపోయింద‌ని ఆమె కుటుంబ స‌భ్యులు ఆరోపించారు.

దీనిపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించిన రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​... ఎస్సై, కానిస్టేబుల్​ నిర్లక్ష్యం వల్లే ఆమె మృతిచెందినట్లు తేలడంతో వారిని సస్పెండ్​ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరియమ్మ మృతిపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మరియమ్మ మరణానికి కారకులైన ప్రతి ఒక్కరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: MURDER: విజయవాడ దుర్గ అగ్రహారంలో దారుణం.. నడిరోడ్డుపై వ్యక్తి హత్య

ABOUT THE AUTHOR

...view details