నాయిని మృతిపట్ల కాంగ్రెస్ నేతల సంతాపం - Naini Death Latest News
నాయిని మృతిపట్ల కాంగ్రెస్ నేతలు ఉత్తమ్, భట్టి విక్రమార్క, రేవంత్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. కార్మిక నేతను కోల్పోయామని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కార్మిక పక్షపాతి, తెలంగాణ ఉద్యమకారుడు నాయిని మృతి తీరని లోటని ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. నాయిని మృతి అందరికి తీరని లోటని సీనియర్ నేత జానారెడ్డి చెప్పారు. గత పది రోజుల కిందటే ఆయనను కలిసినట్లు పేర్కొన్నారు.

నాయిని మృతిపట్ల కాంగ్రెస్ నేతల సంతాపం