తెలంగాణ పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ నేతల బృందం రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసైని కలిసింది. మంథనిలో న్యాయవాద దంపతుల హత్యపై ఫిర్యాదు చేశారు. హత్యపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. గవర్నర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. గవర్నర్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి ఉన్నారు.
హత్యలో అధికార పార్టీ నేతల హస్తం ఉన్నా... పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేయడంలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. న్యాయవాద దంపతుల హత్య రాష్ట్రాన్ని కుదిపేసిందని.. ఈ హత్యను రాష్ట్ర చరిత్రలోనే అత్యంత కిరాతకమైన ఘటనగా అభివర్ణించారు. శీలం రంగయ్య మృతి కేసులో వామన్ రావు దంపతులు హైకోర్టులో కేసు వేయడం, మంథనిలో తెరాస అక్రమాలకు అడ్డుగా నిలవడంతోనే వామన్ రావు దంపతులను పథకం ప్రకారం హత్య చేశారని ఉత్తమ్ ఆరోపించారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు పరిసరాల్లో నుంచి 4వేల కోట్ల రూపాయల ఇసుకను అక్రమంగా తరలించాలని... దీనిపైనా వామన్ రావు పోరాటం చేసేందుకు సిద్ధమవుతుండగా మట్టుబెట్టారన్నారని తెలిపారు.