ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: ఒకరోజు దీక్ష విరమించిన కాంగ్రెస్ నేత వీహెచ్ - వీహెచ్ దీక్ష విరమణ

రైతు ఉద్యమానికి మద్దతుగా ఒక రోజు దీక్ష చేపట్టిన మాజీ ఎంపీ వీ హనుమంతరావు దీక్ష విరమించారు. దీక్షకు సంఘీభావం తెలిపిన కాంగ్రెస్ నేతలు మర్రి శశిధర్ రెడ్డి, మల్లు రవి... నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు.

congress-leader
congress-leader

By

Published : Dec 15, 2020, 1:32 PM IST

రైతులకు మేలు చేయాలనుకుంటే అందరితో సంప్రదింపులు జరిపి ఆమోదయోగ్యమైన చట్టాలను తీసుకువస్తే స్వాగతించేవారమని... కాంగ్రెస్ నేత మర్రి శశధర్ రెడ్డి అన్నారు. రైతు ఉద్యమానికి మద్దతుగా ఒకరోజు దీక్ష చేసిన మాజీ ఎంపీ వీ హనుమంతరావుకు, మల్లు రవితో కలిసి సంఘీభావం తెలిపి... నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.

భాజపా అధికారంలోకి వచ్చి ఆరేళ్లు అయినప్పటికీ... ఇన్ని రోజులు ఎందుకు చేయలేదని శశిధర్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్​ రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. భాజపా, కాంగ్రెసేతర ఫెడరల్ ఫ్రంట్ పెడతామని పెద్ద పెద్ద మాటలు చెప్పిన కేసీఆర్​ దిల్లీ వెళ్లి రాజీ పడ్డారని విమర్శించారు.

ఇదీ చూడండి:రైతుల ఖాతాల్లో 1252 కోట్ల పంటల బీమా సొమ్ము జమ

ABOUT THE AUTHOR

...view details