ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాలి' - congress leader tulasi reddy latest news

వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం తెదేపా, వైకాపా ఎంపీలు కేంద్రంపై పోరాడాలని కాంగ్రెస్​ నేత తులసిరెడ్డి సూచించారు. ప్రత్యేక హోదా ఇవ్వాలన్న భాజపా...అధికారంలోకి వచ్చాక మాట మార్చిందని దుయ్యబట్టారు.

Tulasi Reddy
Tulasi Reddy

By

Published : Sep 13, 2020, 3:11 PM IST

ప్రత్యేక హోదా, విభజన హమీలు, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ హమీ ఇచ్చిందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే ఇచ్చిన హామీలన్నీ అమలు అయ్యేవని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ఐదు కాదు 10 సంవత్సరాల ఇవ్వాలన్న భాజపా...అధికారంలోకి వచ్చిన తరువాత పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్​ సమావేశాల్లో తెదేపా, వైకాపా ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాలని సూచించారు.

అంతర్వేది ఘటనపై భాజపా, జనసేన, తెదేపా రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉండగా వాటి గురించి పట్టించుకోకుండా మత రాజకీయాలు చేయడం తగదన్నారు.

ABOUT THE AUTHOR

...view details