ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Renuka Choudary On Police: యూనిఫాంను ఎలా గౌరవించాలో మాకు తెలుసు: రేణుకా చౌదరి

Renuka Choudary On Police: తెలంగాణలోని పంజాగుట్ట ఎస్​ఐ కాలర్​ పట్టుకొని దురుసుగా ప్రవర్తించిన ఘటనలో కాంగ్రెస్​ నాయకురాలు రేణుకా చౌదరిపై కేసు నమోదైంది. ఐపీసీ 353 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్ట్ అనంతరం గోల్కొండ పీఎస్​లో ఉన్న రేణుకా చౌదరి తనను పోలీసులు వెనక నుంచి తీసినప్పుడు కిందపడే క్రమంలో ఎస్​ఐ భుజాన్ని పట్టుకున్నానని వివరణ ఇచ్చారు. తనకు పోలీసుల పట్ల గౌరవం ఉందని ఎవరిని కించపరచలేదని తెలిపారు.

రేణుకా చౌదరి
రేణుకా చౌదరి

By

Published : Jun 16, 2022, 10:45 PM IST

యూనిఫాంను ఎలా గౌరవించాలో మాకు తెలుసు: రేణుకా చౌదరి

Renuka Choudary On Police: పంజాగుట్ట ఎస్​ఐ కాలర్​ పట్టుకున్న వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి స్పందించారు. తనకు పోలీసుల పట్ల గౌరవం ఉందని యూనిఫాంను ఎలా గౌరవించాలో తెలుసన్నారు. పోలీసులు అరెస్ట్ చేస్తున్న సమయంలో తమ చుట్టూ మగ పోలీసులు ఎందుకున్నారని ఆమె ప్రశ్నించారు. తనను వెనక నుంచి తీయడంతోనే బ్యాలెన్స్ తప్పి కింద పడే క్రమంలో ఎస్​ఐ ఉపేంద్ర బాబు భుజాన్ని పట్టుకున్నానని ఆమె తెలిపారు. ఎస్​ఐని అవమాన పర్చడం తన ఉద్దేశం కాదన్నారు.

యూనిఫాంను ఎలా గౌరవించాలో మాకు తెలుసు. పోలీసుల పట్ల మాకు గౌరవం ఉంది. మా చుట్టూ మగ పోలీసులు ఎందుకున్నారు. వెనకాల నుంచి నన్ను తోసేశారు. నేను అదుపుతప్పి కిందపడుతుండగా ఎస్‌ఐ భుజం పట్టుకున్నా. ఎస్‌ఐని అవమానపర్చడం నా ఉద్దేశం కాదు. దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోంది. కక్షసాధింపునకు దర్యాప్తు సంస్థలను కేంద్రం వినియోగిస్తోంది.

- రేణుకాచౌదరి, కాంగ్రెస్‌ నేత

చలో రాజ్​భవన్​లో పాల్గొన్న రేణుకా చౌదరిని పోలీసులు అరెస్ట్ చేసి గోల్కొండ పోలీస్ స్టేషన్​కు తరలించారు. విధి నిర్వహణలో ఉన్న తన కాలర్​ పట్టుకొని దౌర్జన్యం చేసినందుకు పంజాగుట్ట ఎస్​ఐ ఉపేంద్రబాబు రేణుకా చౌదరిపై ఫిర్యాదు చేశారు. పోలీసులు ఐపీసీ 353 కింద రేణుకా చౌదరిపై కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details