rahul gandhi reached hyderabad: తెలంగాణలోని శంషాబాద్ విమానాశ్రయానికి రాహుల్ గాంధీ చేరుకున్నారు. రాహుల్‌గాంధీకి పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. కాసేపట్లో హైదరాబాద్ నుంచి వరంగల్‌కు రాహుల్ గాంధీ వెళ్లనున్నారు. హెలికాప్టర్‌లో హనుమకొండకు బయల్దేరనున్నారు. వరంగల్‌లో రైతు సంఘర్షణ సభకు హాజరుకానున్నారు.
ఇప్పటికే హనుమకొండలో రాహుల్ గాందీ రైతు సంఘర్షణ సభకు సర్వం సిద్ధం చేశారు. ఈ సభ సాయంత్రం 6.05 గంటలకు హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో జరగనుంది. అక్కడి మైదానం ఫ్లెక్సీలు, కాంగ్రెస్ జెండాలతో ముస్తాబు అయింది. రాహుల్ పర్యటన దృష్ట్యా కేంద్ర భద్రతా బలగాలు, స్థానిక పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.