Mahesh Kumar Goud Fires on HCA: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శలు గుప్పించారు. ఇద్దరూ కలిసి క్రీడాకారుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు. టికెట్ల వ్యవహారం హైదరాబాద్ ఇమేజ్‌ని దెబ్బతీస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ల విక్రయంపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చెప్పే మాటల్లో పొంతన లేదన్నారు.
క్రికెట్ మ్యాచ్ సజావుగా సాగుతుందన్న నమ్మకం లేదన్న కాంగ్రెస్ నేత - హెచ్‌సీఏ ప్రభుత్వంపై మహేశ్ గౌడ్ ఫైర్
Mahesh Kumar Goud on HCA హెచ్‌సీఏ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కలిసి క్రీడాకారుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. క్రికెట్ మ్యాచ్ టికెట్ల వ్యవహారం హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతీస్తుందని విమర్శించారు.
'టికెట్ల విక్రయ విషయంలో హెచ్‌సీఏ, ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యింది. టికెట్లు తీసుకోవడానికి వచ్చిన వారిపై పోలీసులు ఎందుకు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది? ప్రభుత్వం అండదండల వల్లే ఈ తతంగమంతా జరిగింది. ఈ వ్యవహారంలో దోషులు ఎవరున్నా శిక్షించాల్సిందే. వ్యక్తులు, పార్టీలతో సంబంధం లేకుండా దోషులను శిక్షించాలి. రేపటి మ్యాచ్ సజావుగా జరుగుతుందని నమ్మకం లేదు. క్రీడాకారులకు, అభిమానులకు కాంగ్రెస్ అండగా ఉంటుంది'-మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు
ఇవీ చదవండి: