ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రాన్ని నిలదీయండి' - ప్రధాని మోదీకి కేవీపీ రామచంద్రరావు లేఖ

పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వమే పూర్తి చేయాలని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ డిమాండ్ చేశారు. విభజన చట్టంలోని హామీలను కేంద్రం విస్మరిస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉండడం సరికాదన్నారు. ఈ విషయంపై సీఎం జగన్‌కు లేఖ రాశానని కేవీపీ తెలిపారు.

congress leader kvp ramachandrarao letter to cm jagan and pm modi
కేవీపీ రామచంద్రరావు

By

Published : Mar 9, 2020, 12:36 PM IST

విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన వాటిపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు.. ముఖ్యమంత్రి జగన్​కు లేఖ రాశారు. అలాగే ఏపీకి పారిశ్రామిక పన్ను రాయితీలు, వెనుకబడిన ప్రాంతాలకు బుందేల్​ఖండ్ తరహా ప్యాకేజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు 90శాతం నిధులు ఇవ్వాలని ప్రధాని మోదీకి మరో లేఖ రాశారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా కుంటిసాకులు చెప్తూ మోదీ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు దక్కేలా పరిశ్రమల రాకకు సహకరించాలని కోరారు. మిగిలిన రాష్ట్రాలతో సమానంగా ఏపీ నిలబడేవరకు సహాయం అందించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.

ప్రధాని మోదీకి కేవీపీ రామచంద్రరావు లేఖ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details