ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: లాకప్ డెత్​పై గవర్నర్​కు కాంగ్రెస్​ నేతల ఫిర్యాదు - cp mahesh bhagwat

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్​(tamilisai soundararajan)ను కాంగ్రెస్ నేతల బృందం కలిసింది. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్​ స్టేషన్​లో మహిళ మృతి ఘటనపై కాంగ్రెస్​ ఫిర్యాదు చేసింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(bhatti vikramarka), ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు (sridhar babu) కోరారు.

governor tamilisai
గవర్నర్ తమిళిసై సౌందర రాజన్​కు లేఖ

By

Published : Jun 25, 2021, 8:05 PM IST

తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో దళిత.. గిరిజనుల లాకప్ డెత్​లు పెరిగాయని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. మరియమ్మ లాకప్ డెత్​కు కారణమైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసైని వారు కోరారు.

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎస్​సీ సెల్ అధ్యక్షుడు ప్రితంలు గవర్నర్ తమిళసైని కలిసి ఫిర్యాదు చేశారు. అడ్డగూడూరు ఠాణా ఘటన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, మరియమ్మ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలని వినతిపత్రం అందజేశారు.

తల్లిదండ్రులు లేని ఆ కుటుంబానికి భూమి, ఆర్థిక సాయం ఇవ్వాలని కోరినట్లు వారు తెలిపారు. దళిత, గిరిజనులకు బతికే హక్కు లేదా అని వారు ప్రశ్నించారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ఈ ప్రభుత్వం కాల రాస్తుందని ఆరోపించారు.

మరియమ్మ మృతి పోలీసు హత్యానా, ప్రభుత్వ హత్యానా అని ఎద్దేవా చేశారు. శాంతి భద్రతలు కాపాడే పోలీసులే హింస చేస్తే.. ఎవరికి చెప్పుకోవాలని నిలదీశారు. గతంలో మంథనిలో లాకప్​డెత్ జరిగినా.. చర్యలు లేవని అన్నారు. పోలీసు యంత్రాంగాన్ని తెరాస పార్టీ యంత్రాంగం వాడుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో కొంత మంది పోలీసులు తమ తీరు మార్చుకోవాలని.. పోస్టింగుల కోసం తెరాస కార్యకర్తల మాదిరిగా పని చేస్తున్నారని విమర్శించారు. దళిత, గిరిజనులకు బతికే హక్కు లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్నారని నేతలు ఆరోపించారు.

అసలేం జరిగింది

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీసుల కస్టడీలో మరియమ్మ అనుమానాస్పద మృతికి సంబంధించి ఇప్పటికే ముగ్గురు పోలీసులపై వేటు పడింది. అడ్డగూడూరు ఠాణా ఎస్సై మహేశ్‌, కానిస్టేబుళ్లు రషీద్‌, జానయ్యలను సస్పెండ్‌ చేస్తూ రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌(cp mahesh bhagwat) ఉత్తర్వులు జారీచేశారు. దొంగతనం కేసు విచారణలో భాగంగా పోలీసుల కస్టడీలో ఉన్న మరియమ్మ ఈ నెల 11న అనుమానాస్పదస్థితిలో మృతిచెందారు.

ఈ వ్యవహారంలో ఆ ఠాణా పోలీసులపై పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. సీపీ మహేశ్‌ భగవత్‌.. మల్కాజిగిరి ఏసీపీ శ్యాంప్రసాద్‌ను కేసు విచారణాధికారిగా నియమించారు. ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లు ఠాణాలో మహిళకు సరైన రక్షణ కల్పించడంలో అలసత్వం వహించినట్లు తేలడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.

ఇదీ చూడండి:High Court: 'చిన్న చిన్న కారణాలతో అనర్హులుగా ప్రకటించడం ఏమిటి..?'

ABOUT THE AUTHOR

...view details