ఆధారాలు చూపకపోతే..కుల ధ్రువీకరణ పత్రం ఇవ్వం' - ఏపీలో స్థానిక పోరు వార్తలు
స్థానిక ఎన్నికల్లో పోటీచేసేందుకు అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రాల కోసం తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. ధ్రువపత్రాలు ఇవ్వటంలో జాప్యం జరుగుతోందని కొందరు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తమ వద్దకు వచ్చిన పత్రాలను పరిశీలించి వెంటనే కుల ధ్రువీకరణ పత్రం ఇస్తున్నామని విజయవాడ అర్బన్ తహసీల్దార్ జయశ్రీ చెబుతున్నారు. కుల ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆధారాలు తీసుకురావాలని సూచించారు. అధికారులు పత్రాలు ఇచ్చేందుకు అందుబాటులో ఉన్నారని తెలిపారు . సరైన ఆధారాలు చూపకపోతే..కుల ధ్రువీకరణ పత్రం ఇవ్వలేమని స్పష్టం చేశారు.
confusions in the grant of caste certificates over local elections