ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Face based attendance: ముఖ ఆధారిత హాజరు నమోదుపై వీడని సందిగ్ధత - అమరావతి వార్తలు

ముఖ ఆధారిత హాజరు నమోదుపై సందిగ్ధత వీడలేదు. మంత్రి బొత్సతో జరిగిన చర్చలపై ప్రభుత్వం, ఉపాధ్యాయ సంఘాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చర్చల్లో యాప్ సమస్యల పరిష్కారానికి 15రోజుల అదనపు సమయం ఇస్తామని, అప్పటి వరకు ఎలాంటి చర్యలు ఉండబోవనే స్పష్టత ప్రభుత్వం నుంచి వచ్చిందని ఉపాధ్యాయ సంఘాలు చెప్తుంటే అలాంటి హామీ ఏమీ లేదని ఉన్నతాధికారులు అంటున్నారు. మరోవైపు ప్రభుత్వం మాటతప్పి తమను ఇబ్బంది పెట్టాలని చూస్తే న్యాయపోరాటానికి సిద్ధమవుతామని ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

face based attendance
ముఖ ఆధారిత హాజరు నమోదు

By

Published : Sep 3, 2022, 7:20 AM IST

Face based attendance ముఖ ఆధారిత హాజరు నమోదుపై ఈనెల 1న ఉపాధ్యాయ సంఘాలతో మంత్రి బొత్స జరిపిన చర్చల్లో గందరగోళం నెలకొంది. భేటీ తర్వాత సంఘాల నాయకులు సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు 15రోజులు సమయం ఇచ్చారని మీడియాకు వెల్లడించగా.. అలాంటిదేమీ లేదని ఆ తర్వాత మంత్రి బొత్స ప్రకటించారు. ఇందుకనుగుణంగా నిన్న జిల్లా విద్యాశాఖాధికారులకు కమిషనరేట్‌ నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన చర్చల్లో హాజరు నమోదుకు... 15రోజుల అదనపు సమయం ఇచ్చినట్లు కొన్ని సంఘాలు చెబుతున్నది నిజం కాదని కమిషనరేట్‌ పేర్కొంది. ఉపాధ్యాయుల ముఖ ఆధారిత హాజరును సెప్టెంబరు 1 నుంచి తప్పనిసరిగా వేయాలని... దీన్ని ప్రధానోపాధ్యాయులందరికీ తెలియచేయాలని ఆదేశించింది. సాంకేతిక సమస్యలు వస్తే సరిదిద్దడానికి ఐటీ బృందానికి నివేదించాలని ఆదేశించింది.

అటు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలకు భిన్నంగా అధికారుల వైఖరి ఉందంటూ ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య యూటీఎఫ్​, ఏపీటీఎఫ్​లు విమర్శించాయి. ముఖ ఆధారిత హాజరు నమోదులో ఉన్న సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని అధికారులు చెప్పినట్లు ఓ ప్రకటనలో సంఘాలు పేర్కొన్నాయి. అధికారులు చెప్పిన దానికి భిన్నంగా వ్యవహరించడం వల్ల ఉపాధ్యాయుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఫోన్‌లలో వ్యక్తిగత సమాచారం భద్రతపై మంత్రి బొత్స, అధికారులు ఇచ్చిన భరోసా వారిలో ఆత్మ విశ్వాసాన్ని కలిగించేదిగా లేదని మండిపడుతున్నారు. వ్యక్తిగత సమాచార భద్రత విషయంలో వాస్తవాలు నిర్దరించేందుకు ప్రభుత్వం ఒక టెక్నికల్‌ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తమ భద్రతకు భంగం వాటిల్లేటట్లు ఉంటే ..యాప్‌ను అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు.

"ముఖ ఆధారిత హాజరు నమోదులో ఉన్న సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరిస్తాం. 15రోజుల్లోగా అన్ని ఇబ్బందులనూ పరిష్కరిస్తామని అప్పటి వరకు ఎలాంటి చర్యలూ ఉండబోవని అధికారులు చెప్పారు. అధికారులు చెప్పిన దానికి భిన్నంగా వ్యవహరించడం వల్ల మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫోన్‌లలో వ్యక్తిగత సమాచార భద్రతపై మంత్రి బొత్స, అధికారులు ఇచ్చిన భరోసా వారిలో ఆత్మ విశ్వాసాన్ని కలిగించేదిగా లేదు. వ్యక్తిగత సమాచార భద్రత విషయంలో వాస్తవాలు నిర్ధారించేందుకు ప్రభుత్వం ఒక టెక్నికల్‌ కమిటీని ఏర్పాటు చేయాలి.ఉపాధ్యాయుల సొంత ఫోన్లలో హాజరు నమోదు చేయాలని ప్రభుత్వం ఒత్తిడి చేయడం తగదు" - వెంకటేశ్వర్లు, ప్రసాద్‌, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, యూటీఎఫ్‌

ముఖ ఆధారిత హాజరు నమోదు

ముఖ ఆధారిత హాజరు నమోదుకు ప్రభుత్వమే డివైజ్‌లు సరఫరా చేయాలని ఉపాధ్యాయులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం పరికరాలు సరఫరా చేస్తే... హాజరు నమోదుకు తమకు అభ్యంతరం లేదని అంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details