తెలంగాణలోని బంజారాహిల్స్ ఎన్జీటీనగర్ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. భాజపా కార్యకర్తలు కాషాయ మాస్కులు ధరించారని తెరాస శ్రేణులు ఆందోళనకు దిగారు. తెరాస కార్యకర్తలు చేతులకు గులాబీ కంకణాలు కట్టుకున్నారని భాజపా శ్రేణులు ఆందోళనకు దిగారు. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇరుపార్టీల వారినీ చెదరగొట్టారు. దీంతో ఎన్జీటీ నగర్‌లో ఉద్రిక్తత నెలకొంది.
గులాబీ మాస్కులపై కాంగ్రెస్ అభ్యంతరం