ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కృష్ణా జిల్లాలో వ్యాక్సినేషన్ డ్రై రన్​కు సర్వం సిద్ధం - కృష్ణా జిల్లాలో కొవిడ్ డ్రై రన్

కృష్ణా జిల్లాలో వ్యాక్సినేషన్ డ్రై రన్​కు సిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. డ్రైవ్ రన్ చేపడుతున్న 5 ప్రాంతాల్లో కావాల్సిన వ్యాక్సినేషన్ లార్జిస్టిక్​ను అందుబాటులో ఉంచామన్నారు. విజయవాడ జీజీహెచ్​లో ఏర్పాట్లను పరిశీలించారు. 28వ తేదీ ఉదయం డ్రై రన్ ప్రారంభమవుతుందని తెలిపారు.

vaccination in krishna district on monday
vaccination in krishna district on monday

By

Published : Dec 27, 2020, 6:50 PM IST

కృష్ణా జిల్లాలో వ్యాక్సినేషన్ డ్రై రన్​కు సర్వం సిద్ధం

సోమవారం జరగనున్న వ్యాక్సినేషన్ డ్రై రన్​కు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని ఐదు ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి లార్జిస్టిక్స్​ను అందుబాటులోకి తెచ్చారు. ఒక్కో కేంద్రంలో ఐదుగురు సిబ్బంది ఉంటారు. విజయవాడ ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని కలెక్టర్ ఇంతియాజ్ పరిశీలించారు. డ్రై రన్​కు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నార.

వ్యాక్సిన్ కోసం వచ్చే వ్యక్తి ప్రవేశ మార్గంలో తన వివరాలను మహిళా పోలీసుకు తెలపాలని అధికారులు సూచించారు. ఒక్కో కేంద్రంలో మూడు గదులుంటాయి. మొదటి గదిలో రిజిస్ట్రేషన్ , రెండో గదిలో వ్యాక్సినేషన్, మూడో గదిలో అబ్జర్వేషన్ చేస్తారని తెలిపారు. ఒక్కో కేంద్రంలో 25 మందికి వ్యాక్సినేషన్ ఇస్తారని తెలిపారు. విజయవాడ జీజీహెచ్, తాడిగడప కృష్ణవేణి డిగ్రీ కాలేజీ, ప్రకాష్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్, పూర్ణ ఇనిస్టిస్ట్యూట్, ఉప్పులూరు పీహెచ్​సీల్లో డ్రైవ్ రన్ చేపడుతున్నట్లు తెలిపారు. వ్యాక్సినేషన్ తీసుకునే వారి వివరాలు కో విన్ యాప్​లో ముందుగానే రిజిస్ట్రర్ చేశామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details