అదనపు రవాణా ఛార్జీల భారాన్ని ప్రభుత్వమే భరించనుంది. ఈ రూ.3,500లను కూడా ఇంటి రాయితీ కింద అందించే రూ.1.80 లక్షల నుంచి మినహాయిస్తుంది. లబ్ధిదారులు చేతి నుంచి చెల్లించాల్సిన అవసరం లేదు. విశాఖపట్నం, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో ఉన్న లేఅవుట్ల నుంచి ప్రభుత్వం కేటాయించిన ఇసుక రీచ్‌లు 100 కి.మీపైగా దూరంలో ఉన్నాయి. దాంతో లబ్ధిదారులపై రవాణా ఛార్జీల భారం పడకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం 20 టన్నుల ఇసుక ఉచితంగా అందిస్తుంది. 10 టన్నుల చొప్పున పునాది దశలో, స్లాబు దశలో రెండు విడతలుగా ఇసుకను ఇస్తోంది. సరఫరాకు సంబంధించి కూపన్లు ఇస్తారు. రీచ్‌ల ఎంపికలో మూడు ఆప్షన్లు ఇస్తారు. రవాణా ఛార్జీని లబ్ధిదారులే భరించాలి. ఇసుక రవాణాకు టన్నుకు కిలోమీటర్‌కు రూ.5 చొప్పున వసూలు చేస్తారు. 40 కి.మీల కంటే తక్కువ దూరం ఉంటే లబ్ధిదారులే రీచ్‌ల నుంచి ఇసుక తీసుకెళ్లవచ్చు.