ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆస్పత్రుల్లో చేరికల పెరుగుదల.. మూడో ముప్పు తరుణంలో ఆందోళన

కరోనా మూడో దశ వ్యాప్తిపై సంకేతాలు వస్తున్న తరుణంలో రాష్ట్రంలో కొవిడ్ ఆస్పత్రుల్లో బాధితుల చేరిక ఆందోళన కలిగిస్తోంది. గత పది రోజులుగా కొవిడ్‌ ఆస్పత్రుల్లో బాధితుల చేరిక పెరుగుతోంది. వైరస్‌ వ్యాప్తి తగ్గినట్లే తగ్గి మళ్లీ పుంజుకుంటోదనడానికి ఇదే నిదర్శనమని వైద్యులు చెబుతున్నారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నారు.

hospitals filed with covid patients
ఆస్పత్రుల్లో పెరుగుతున్న కొవిడ్ కేసులు

By

Published : Aug 2, 2021, 5:17 AM IST

Updated : Aug 2, 2021, 7:31 AM IST

ఆస్పత్రుల్లో పెరుగుతున్న కొవిడ్ కేసులు

రాష్ట్రంలో కొవిడ్ ఆసుపత్రుల్లో బాధితుల చేరికలు పెరగడం కలవరపెడుతోంది. జులై 20 నుంచి రోజూ సగటున 594 మంది చొప్పున చేరుతున్నారు. ఆస్పత్రుల నుంచి డిశ్ఛార్జి అవుతున్నవారు 500 మంది దాకా ఉంటున్నారు. జులై 2 నుంచి 11వ తేదీ మధ్య సగటున 197 మంది ఆసుపత్రుల్లో చేరారు. వైరస్ వ్యాప్తిలో మూడో దశ ఉండొచ్చన్న సంకేతాలు వస్తున్న వేళ ఆసుపత్రుల్లో చేరికలు పెరగడం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అసరాన్ని గుర్తుచేస్తోందని వైద్యులు సూచిస్తున్నారు.

వైరస్ వేరియంట్లలో వచ్చిన మార్పుల వల్ల శ్వాస తీసుకోవడంలో సమస్లు వంటి కారణాలతో ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య పెరుగుతోందని చెబుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం శనివారం నాటికి రాష్ట్రంలో 21 వేల 180 క్రియాశీల కేసులు ఉన్నాయి. వీరిలో 5 వేల 51 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారు కొవిడ్ సంరక్షణ కేంద్రాలు, ఇళ్లలో ఉంటూ వైద్యం పొందుతున్నారు. ఆసుపత్రుల్లో ఉన్నవారిలో 47.3 శాతం మంది ఆక్సిజన్ వార్డుల్లో, 15.6 శాతం మంది ఐసీయూ(ICU)లో 4.77 శాతం మంది వెంటిలేటర్లపై ఉన్నారు. కొవిడ్ చికిత్స 276 ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండగా...3 వేల 983మంది ప్రభుత్వాసుపత్రుల్లో ఉన్నారు.

ఆంక్షల సడలింపును దుర్వినియోగం చేయొద్దు..

కరోనా రెండో దళ తగ్గుముఖం పట్టిందన్న ఉద్దేశంతో రాష్ట్రప్రభుత్వం కర్ఫ్యూ ఆంక్షలు సడలించింది. ప్రస్తుతం రాత్రి 10 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమలులో ఉన్నాయి. ఆంక్షల సడలింపును దుర్వినియోగం చేయొద్దని, మహమ్మారి ముప్పు ఇంకా తొలగిపోలేదని... అందరూ నిబంధనలు పాటించాల్సిందేనని వైద్య నిపుణులు చెబుతూనే ఉన్నారు. ప్రజలకు కొవిడ్ నిబంధనలు పట్టనట్లే కనిపిస్తోంది. భారీ జనసమూహ కార్యక్రమాలు యథావిథిగా సాగుతున్నాయి. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతుండటం చర్చనీయాంశమైంది. దీనిని వైరస్‌ ప్రభావ హెచ్చరికలుగా తీసుకోవాలని సీనియర్ వైద్యులు విశ్లేశిస్తున్నారు.

రాష్ట్రంలో తొలి విడతలో పాజిటివిటీ రేటు తగ్గుదల వేగంగా ఉంది. మలి విడతలో మాత్రం నెమ్మదిగా తగ్గుతోంది. ఈ కేసుల నమోదు తీరు కరోనా మలివిడత ప్రభావం ఇంకా ముగిసిపోలేదన్న విషయాన్ని స్పష్టం చేస్తోందని వైద్యులు చెబుతున్నారు.


ఇదీచదవండి..

AP CORONA: రాష్ట్రంలో కొత్తగా 2,287 కేసులు..18మరణాలు

Last Updated : Aug 2, 2021, 7:31 AM IST

ABOUT THE AUTHOR

...view details