తెలంగాణలోని హుజూరాబాద్‌లో ఉద్రిక్తత తలెత్తింది. తెరాస, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అంబేడ్కర్ కూడలిలో తెరాస, భాజపా వర్గాలు ఘర్షణకు దిగాయి. ఒకరినొకరు తోసేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఎస్సీలను కించపరిచేలా ఈటల జమున అన్న మధుసూధన్ వ్యాఖ్యలు చేశారంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా.. అదే విషయం గొడవకు దారితీసింది. దాన్ని తెరాస వర్గీయులే సృష్టించారని భాజపా స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఈటల జమున హుజురాబాద్ అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అదే సమయంలో తెరాస వర్గీయులు రావడంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. ఇరువర్గాల నినాదాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు జోక్యం చేసుకుని తెరాస వర్గీయులను అక్కడి నుంచి పంపించారు.
Huzurabad: హుజూరాబాద్‌లో ఉద్రిక్తత.. తెరాస, భాజపా శ్రేణుల ఘర్షణ - telangana varthalu
తెలంగాణలోని హుజూరాబాద్‌లో ఉద్రిక్తత తలెత్తింది. తెరాస, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అంబేడ్కర్ కూడలిలో తెరాస, భాజపా వర్గాలు ఘర్షణకు దిగాయి. ఒకరినొకరు తోసేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.
ఈ నేపథ్యంలో హుజూరాబాద్‌లో భాజపా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలు తగులబెట్టేందుకు భాజపా శ్రేణులు యత్నించాయి. ఆందోళన చేపట్టిన కార్యకర్తలను అడ్డుకుని పోలీసులు అక్కడి నుంచి పంపించారు. అనంతరం మరోసారి అంబేడ్కర్ కూడలికి వచ్చి భాజపా కార్యకర్తలు నిరసన తెలిపారు. కూడలిలో తెరాస ఫ్లెక్సీలు తగులబెట్టి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు కూడలికి చేరుకుని వారిని అక్కడి నుంచి పంపించారు. తెరాస, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణ నేపథ్యంలో హుజూరాబాద్‌లో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.