కృష్ణా తీరంలో ఇసుక తవ్వకాలపై అమరావతి రైతులు భగ్గుమన్నారు. తవ్వకాలను నిరసిస్తూ మందడం, ఉద్దండరాయనిపాలెం ప్రాంతాల్లో ఆందోళనకు దిగారు. డ్రెడ్జింగ్‌తో కరకట్ట దెబ్బతింటుందని.. దీనివల్ల రాజధాని ప్రాంతం మునిగే ప్రమాదం ఉందని ఆందోళన వెలిబుచ్చారు. అలాగే తవ్విన ఇసుకను పొలాల్లో డంప్ చేస్తుండటంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కరకట్టపై బైఠాయించి రైతులు, మహిళా ఐకాస నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈడ్చుకెళ్లి మరీ జీపుల్లో ఎక్కించి స్టేషన్‌కు తరలించారు. గతంలోనూ కరకట్ట వద్ద ఇసుక తవ్వకాలు చేపట్టగా.. రైతుల ఆందోళనలతో కాంట్రాక్టు సంస్థ జె.పి.వెంచర్స్ కొంతకాలం పాటు వెనక్కి తగ్గింది. ఇప్పుడు మళ్లీ ఇసుక తవ్వకాలు చేపట్టింది.
కృష్ణా తీరంలో ఇసుక తవ్వకాలపై అమరావతి రైతుల ఆందోళన - Krishna district updates
కృష్ణా తీరంలో ఇసుక తవ్వకాలపై అమరావతి రైతుల ఆందోళన చేశారు. మందడం, ఉద్దండరాయనిపాలెం ప్రాంతాల్లో రైతులు ఆందోళనకు దిగారు. డ్రెడ్జింగ్ కారణంగా కరకట్ట దెబ్బతింటుందని రైతులు అంటున్నారు.
Concern
Last Updated : Oct 8, 2021, 11:00 AM IST