ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వరంగల్ నిట్ లో కంప్యూటర్ సీటు కావాలంటే.. ఇది తప్పనిసరి

By

Published : Aug 11, 2022, 3:38 PM IST

NIT Warangal: ఎన్‌ఐటీ వరంగల్‌లో బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌లో సీటు పొందడానికి జనరల్‌ కేటగిరీ బాలురు (తెలంగాణ) 3,089 లోపు ర్యాంకు సాధించాలి. బాలికలకు 3,773 లోపు జాతీయ ర్యాంకు తప్పనిసరి. గత విద్యాసంవత్సరం జోసా కటాఫ్‌ ర్యాంకులను బట్టి ఇది తెలుస్తోంది.

warangal nit
warangal nit

NIT Warangal: రాష్ట్రంలో ఎన్‌ఐటీ వరంగల్‌లో బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌(సీఎస్‌)లో సీటు పొందడానికి జనరల్‌ కేటగిరీ బాలురు(తెలంగాణ) 3,089 లోపు ర్యాంకు సాధించాలి. బాలికలకు 3,773 లోపు జాతీయ ర్యాంకు తప్పనిసరి. గత విద్యాసంవత్సరం(2021) జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ(జోసా) కటాఫ్‌ ర్యాంకులను బట్టి ఇది స్పష్టమవుతోంది. ఈ సారి పోటీని బట్టి కొద్దిగా అటుఇటుగా మారవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇటీవల జేఈఈ మెయిన్‌ ర్యాంకులు వెల్లడైన విషయం తెలిసిందే. ఎన్‌ఐటీల్లో 50 శాతం సీట్లను ఆ ఎన్‌ఐటీ ఉన్న రాష్ట్రం(హోం స్టేట్‌)లోని విద్యార్థులకు, మిగిలిన 50 శాతం సీట్లను ఇతర రాష్ట్రాల వారికి కేటాయిస్తారు. ఈ లెక్కన ఎన్‌ఐటీ వరంగల్‌లోని సగం సీట్లను తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు ఇస్తారు. మిగిలిన సీట్లకు దేశంలోని అన్ని రాష్ట్రాల వారు పోటీపడొచ్చు.

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌ఐటీ ఏర్పాటైనందున ఆ రాష్ట్ర విద్యార్థులకు ఇప్పుడు వరంగల్‌లో ‘హోం స్టేట్‌ కోటా’ లేదు. ఓపెన్‌ కోటా విద్యార్థులకు 55 వేల ర్యాంకు వచ్చినా ఎన్‌ఐటీ వరంగల్‌లో సీటు(ఏ కోర్సులోనైనా..) వస్తుంది. ఉదాహరణకు.. అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్‌ ఫిజిక్స్‌లో 55,819 ర్యాంకుకు ఓపెన్‌ కేటగిరీలో సీటు దక్కుతుంది. దేశంలోని 31 ఎన్‌ఐటీల్లో 24 వేల వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి.

ఇవీ చదవండి:ఏపీ సర్కారు డబ్బులు ఇవ్వట్లేదు.. సుప్రీంకు అమరావతి నిర్మాణ సంస్థ

ABOUT THE AUTHOR

...view details