ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Telangana: తెలంగాణలో లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తివేత.. కానీ ఆ విషయం మరువొద్దట!

By

Published : Jun 19, 2021, 3:14 PM IST

Updated : Jun 19, 2021, 4:06 PM IST

తెలంగాణలో లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తివేత
తెలంగాణలో లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తివేత

15:12 June 19

తెలంగాణ ప్రజలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తివేస్తూ.. మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి కారణంగా.. నెలల తరబడి అన్ని మూతబడ్డాయి. ప్రభుత్వ నిర్ణయంతో రేపట్నుంచి అన్నీ తెరుచుకోనున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తివేస్తూ... కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ సంపూర్ణంగా ఎత్తివేయాలని ఆ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. రేపట్నుంచి పూర్తిగా లాక్‌డౌన్ ఎత్తివేయనున్నారు.

కొవిడ్‌ ఉద్ధృతి తగ్గడంతో ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఎత్తివేసింది. తెలంగాణలో ఇప్పటికే కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. కొవిడ్‌ కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు తగ్గిందని వైద్యారోగ్యశాఖ నివేదిక ఇచ్చింది. వైద్యారోగ్యశాఖ నివేదిక పరిశీలించిన మంత్రివర్గం... లాక్‌డౌన్‌ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆంక్షలన్నీ ఎత్తివేయాలని అధికారులను ఆదేశించింది.  

ప్రజల ఉపాధి దెబ్బతినొద్దనే ఉద్దేశంతో లాక్‌డౌన్ ఎత్తివేత నిర్ణయం తీసుకున్నాం. మంత్రివర్గ నిర్ణయానికి ప్రజల సహకారం కావాలి. లాక్‌డౌన్ ఎత్తివేసినంత మాత్రాన కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం మరువొద్దు. స్వీయ నియంత్రణ విధానాలు విధిగా పాటించాలి.-మంత్రివర్గం

జులై 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. జులై 1 నుంచి అన్ని రకాల విద్యాసంస్థలను ప్రారంభించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. పూర్తిస్థాయి సన్నద్ధతతో విద్యాసంస్థలను పున‌ఃప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  

ఇదీ చదవండీ... 'సీఎం విడుదల చేసింది ఓ చీటింగ్ క్యాలెండర్'

Last Updated : Jun 19, 2021, 4:06 PM IST

ABOUT THE AUTHOR

...view details