విజయవాడ ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌పై లైంగిక వేధింపు ఆరోపణలు వచ్చాయి. సూపరింటెండెంట్ నాంచారయ్యపై ఓ మహిళ.. దిశా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా రెండు నెలల క్రితం ఉద్యోగంలో చేరానని.. అప్పటి నుంచి నాంచారయ్య తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. తన కోరిక తీర్చలేదని ఉద్యోగం నుంచి తొలిగించినట్లు తెలిపింది.
సంబంధిత ఆధారాలను బాధితురాలు పోలీసులకు అప్పగించింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే మహిళను అధికారులు ఉద్యోగం నుంచి తొలిగించారు. బాధితురాలి ఉద్యోగం పోవటంతో ఆమె కుటుంబం కష్టాల్లో పడుతుందని మైనార్టీ సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతున్నారు.