అమరావతిలోని దళితులను మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (mla alla ramakrishna reddy) అవహేళన చేసి మాట్లాడారంటూ తుళ్లూరు పోలీసుస్టేషన్ (Thullur Police station) లో కొందరు దళిత రైతులు ఫిర్యాదు చేశారు. వెంటనే ఎమ్మెల్యే ఆర్కేపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాజధాని అమరావతి కోసం సంతోషంగా తమ భూములిచ్చామని రైతులు తెలిపారు. కానీ ఎమ్మెల్యే ఆర్కే.. బలవంతంగా భూములను లాక్కున్నారంటూ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. దళితులపై నిజంగా ఆర్కేకు ప్రేమ ఉంటే.. అమరావతిని అభివృద్ధి చేయాలని సవాల్ విసిరారు.
ఎమ్మెల్యే ఆర్కే ఎమన్నారంటే...
అమరావతిలోని దళిత రైతుల భూములను లాక్కోవడంలో ప్రమేయమున్న ప్రతి ఒక్కరినీ అరెస్ట్ చేయాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (mla alla ramakrishna reddy) డిమాండ్ చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రాజధాని ప్రాంతంలో దళితులు ఉండకూడదని ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు (Chancdrababu) భావించారని ఆరోపించారు. అందుకే పక్కా పథకం ప్రకారం వారి భూములను లాక్కున్నారని వ్యాఖ్యానించారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారులను రంగంలోకి దింపి ఈ వ్యవహారానికి తెరలేపారని అన్నారు. మంగళిగిరి, తాడేపల్లిలోని అసైన్డ్ భూముల (assigned lands)ను గుర్తించి.. రైతులను బెదిరించారని చెప్పారు. రాజధాని భూమలు విషయంలో ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి అధికారులు ఉన్నారని.. వీరిలో ఏ ఒక్కర్నీ వదలిపెట్టవదని పోలీసులను కోరారు. తన వద్ద ఉన్న ఆధారాలను సీఐడీ పోలీసులకు అప్పగిస్తానని అన్నారు.