Complaint against HCA and Azharuddin: హైదరాబాద్ క్రికెట్ ఆసోసియేషన్పై వరుస ఫిర్యాదులు నమోదవుతున్నాయి. తాజాగా ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో టికెట్ల విషయంలో కోట్ల కుంభకోణం జరిగిందటూ.. దీనిపై త్వరితగతిన విచారణ జరపాలని వీహెచ్‌పీ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ రావినూతల శశిధర్ హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఆస్ట్రేలియా-ఇండియా క్రికెట్ మ్యాచ్.. అజారుద్దీన్, హెచ్‌సీఏపై మరో ఫిర్యాదు
Complaint against HCA and Azharuddin: ఆస్ట్రేలియా-ఇండియా క్రికెట్ మ్యాచ్‌కు సంబంధించి టికెట్ల వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగిందంటూ వీహెచ్‌పీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ రావినూతల శశిధర్ హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హెచ్‌సీఏతో పాటు అధ్యక్షుడు అజారుద్దీన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అజారుద్దీన్‌పై ఫిర్యాదు
మ్యాచ్ సందర్భంగా ఆన్లైన్, కాంప్లిమెంటరీ టికెట్ల పేరుతో హెచ్‌సీఏతో పాటు అధ్యక్షుడు అజారుద్దీన్ పాల్పడ్డ అక్రమాలపై కేసు నమోదు చేయాలని ఆయన పేర్కొన్నారు. టికెట్ల కుంభకోణం వెనక ఉన్న నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా జింఖానా మైదానంలో తొక్కిసలాట, టికెట్ల వ్యవహారంలో ఇప్పటికే బేగంపేట పోలీస్ స్టేషన్లో నాలుగు కేసులు నమోదయ్యాయి.
ఇవీ చదవండి: