అమరావతిలో నిర్మాణంలో ఉన్న భవనాల అధ్యయనానికి కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాలు, నివాస భవనాల నిర్మాణంపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. భవనాలు పూర్తి చేయాలా? వద్దా? అనే అంశంపై పరిశీలించనుంది. భవనాలు పూర్తి చేయనిపక్షంలో ప్రత్యామ్నాయ మార్గాలపైనా అధ్యయనం చేయనుంది.
అమరావతిలో నిర్మాణంలో ఉన్న భవనాల అధ్యయనానికి కమిటీ - amaravathi building contructions latest news
అమరావతి
19:19 February 11
ఖజానాపై భారం తగ్గించే మార్గాలపై అధ్యయనానికి ప్రభుత్వం ఆదేశం జారీ చేసింది. శాసన రాజధానికి అవసరమైన భవనాలపై కమిటీ పరిశీలిస్తుంది. సీఎస్ నేతృత్వంలో 9 మంది అధికారులతో కమిటీ నియమించారు. శాసనసభ కార్యదర్శి, సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శి, పురపాలకశాఖ కార్యదర్శి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి,ఏఎంఆర్‌డీఏ కమిషనర్, సీఎం ముఖ్య సలహాదారు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.
ఇదీ చదవండి:'ఎర్రచందనం విక్రయానికి కేంద్ర అనుమతులు తీసుకోవాలి'
Last Updated : Feb 11, 2021, 9:51 PM IST