రాజధానితో పాటు ఇతర ప్రాజెక్టులపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సూచనలు, అభిప్రాయాలు స్వీకరించనుంది. ఈ-మెయిల్, లేఖల ద్వారా అభిప్రాయాలు పంపాలని జీఎన్ రావు కమిటీ వెల్లడించింది. వచ్చే నెల 12వ తేదీ వరకు ప్రజలు తమ సూచనలు, అభిప్రాయాలు పంపవచ్చని సూచించింది.ఎక్స్‌పర్ట్ కమిటీ 2019 ఎట్ జీమెయిల్ డాట్‌కామ్ (expertcommittee2019@gmail.com)కు మెయిల్ చేయాలని తెలిపింది. పటమటలోని నిపుణుల కమిటీ కార్యాలయానికి పోస్టు ద్వారా కూడా అభిప్రాయాలను పంపవచ్చని పేర్కొంది.
అభిప్రాయాలు స్వీకరించనున్న ప్రభుత్వ నిపుణుల కమిటీ - జీఎన్ రావు కమిటీ వార్తలు
రాజధానితో పాటు ఇతర ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ అభిప్రాయాలు స్వీకరించేందుకు సిద్ధమైంది. ఇందుకు వచ్చే నెల 12ను చివరితేదీగా నిర్ధరించింది.
Committee of Experts who will adopt opinions on capital city amaravathi
ఇదీ చదవండి : రాఘవాచారి మృతి పట్ల సీఎం సహా ప్రముఖుల సంతాపం
Last Updated : Oct 28, 2019, 7:37 PM IST