గంగవరం పోర్టు (Gangavaram port)లో వాటాలను.. అదానీ పోర్ట్స్ (Adhani ports), స్పెషల్ ఎకనామిక్ జోన్ (SEZ)లో విలీనం, బదిలీ చేసేందుకు.. రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. గంగవరం పోర్టులో వాటాల బదిలీ, ప్రభుత్వ వాటా పెట్టుబడుల ఉపసంహరణపై.. ఉన్నతాధికారులతో కూడిన ఎంపవర్డ్ కమిటీని నియమించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. గంగవరం పోర్టు లిమిటెడ్‌లో ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణతో పాటు.. అదానీ పోర్ట్స్‌లో జీపీఎల్ విలీన ప్రక్రియను ఈ కమిటీ అమలు చేయనుంది.
Gangavaram port: గంగవరం పోర్టులో వాటాల బదిలీకి కమిటీ నియామకం - committee for transfer of shares in gangavaram port
18:25 June 04
gangavaram port
పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి 60 రోజుల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. గంగవరం పోర్టులో 58.10 శాతం వాటాలు కలిగిన గంగవరం పోర్టు ప్రమోటర్ డీవీఎస్ రాజుకు చెందిన.. విండీ లేక్ సైడ్ ఇన్వెస్ట్‌మెంట్స్ నుంచి అదానీ పోర్ట్స్ కు వాటాల బదిలీ చేసేందుకు కూడా ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఏపీ మారిటైమ్ బోర్డు సిఫార్సుల మేరకు.. గంగవరం పోర్టు లిమిటెడ్‌ను అదానీ సెజ్‌లో విలీనం చేసేందుకు అంగీకరించింది. గంగవరం పోర్టు నిర్మాణ సమయంలో 54 కోట్ల రూపాయల విలువైన 1800 ఎకరాల భూమిని.. 10.4 శాతం వాటాగా రాష్ట్రప్రభుత్వం ఇచ్చింది. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో.. గంగవరం పోర్టు లిమిటెడ్ నిర్మాణం జరిగింది. ఇప్పటివరకూ గంగవరం పోర్టు నుంచి.. 277.97 కోట్ల రూపాయల రెవెన్యూను ప్రభుత్వం ఆర్జించింది.
ఇదీ చదవండి
Anandayya medicine: ఆనందయ్య మందు పంపిణీపై సోమవారం తుది ఆదేశాలు: హైకోర్టు