గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులకు ప్రత్యేకంగా కమిషనరేట్‌ను ఏర్పాటు చేస్తూ... ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక వ్యవహారాల నిర్వహణ కోసం కొత్తగా కమిషనరేట్‌ను ఏర్పాటు చేస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు ఏపీ ఫైనాన్షిల్ కోడ్‌లో సవరణ చేస్తూ.. ఆ శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.ఎస్ రావత్ ఆదేశాలిచ్చారు. ఇక నుంచి గ్రామ, వార్డు సచివాలయ, వాలంటీర్ల విభాగానికి కమిషనరేట్ విభాగాధిపతి కార్యాలయంగా ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.