తెలంగాణలోని హైదరాబాద్ మాదాపూర్‌లో పెనుప్రమాదం తప్పింది. మాదాపుర్ పీఎస్ పరిధిలోని ఖానామెట్ సమీపంలో ఓ ప్రైవేటు కళాశాలకు చెందిన బస్సు సెల్లార్ గుంతలో పడిపోయింది. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో విద్యార్థులు లేకపోవడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంలో బస్సు డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అతన్ని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. బిల్డర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణలో సెల్లార్ గుంతలో పడిపోయిన కళాశాల బస్సు - మాదాపూర్‌లో కళాశాల బస్సుకు తప్పిన పెనుప్రమాదం
ఓ ప్రైవేటు కళాశాలకు చెందిన బస్సు సెల్లార్ గుంతలో పడిపోయిన ఘటన తెలంగాణలోని హైదరాబాద్ మాదాపూర్ పీఎస్ పరిధిలో జరిగింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
![తెలంగాణలో సెల్లార్ గుంతలో పడిపోయిన కళాశాల బస్సు college bus fell in cellar at madhapur in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6038840-36-6038840-1581429374471.jpg)
సెల్లార్ గుంతలో పడిపోయిన కళాశాల బస్సు
తప్పిన పెను ప్రమాదం.. సెల్లార్ గుంతలో పడిన కళాశాల బస్సు
ఇవీ చూడండి: