ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Live Updates : పీఆర్సీకి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద హోరెత్తిన నిరసనలు... - పీఆర్సీపై ఉద్యోగ సంఘాల కలెక్టరేట్ ముట్టడి

employees unions
employees unions

By

Published : Jan 20, 2022, 8:37 AM IST

Updated : Jan 20, 2022, 1:13 PM IST

13:11 January 20

ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయులు అరెస్టు

  • నెల్లూరు గాంధీబొమ్మ వద్ద ఉపాధ్యాయ సంఘాల మానవహారం
  • అనంతపురంలో ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయులు అరెస్టు
  • ఉపాధ్యాయులను పీఎస్‌కు తరలించిన పోలీసులు

12:38 January 20

సచివాలయంలో ఉద్యోగుల నిరసన

  • పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా సచివాలయంలో ఉద్యోగుల నిరసన
  • సచివాలయం మూడో బ్లాక్ వద్ద సమావేశమైన ఉద్యోగులు
  • సచివాలయం: నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరైన ఉద్యోగులు

12:24 January 20

అనంతపురంలో ఉపాధ్యాయులు, పోలీసులకు మధ్య తోపులాట

అనంతపురంలో

  • అనంతపురం కలెక్టరేట్‌ ముట్టడికి యత్నించిన ఉపాధ్యాయులు
  • అనంతపురం: బారికేడ్లు దాటి దూసుకెళ్లాలని ఉపాధ్యాయుల యత్నం
  • అనంతపురం: ఉపాధ్యాయులు, పోలీసులకు మధ్య తోపులాట

చిత్తూరులో

  • చిత్తూరు కలెక్టరేట్‌ ప్రధాన ద్వారం వద్ద ఉపాధ్యాయుల ఆందోళన
  • బారికేడ్లను తోసుకుని ప్రధాన ద్వారం వద్దకు వచ్చిన ఉపాధ్యాయులు

11:46 January 20

కలెక్టరేట్‌ గేట్లు తోసుకుని ముందుకెళ్లేందుకు ఉపాధ్యాయుల యత్నం

నెల్లూరులో..

  • నెల్లూరు కలెక్టరేట్‌ గేట్లు తోసుకుని ముందుకెళ్లేందుకు ఉపాధ్యాయుల యత్నం
  • నెల్లూరు: ఉపాధ్యాయులను అడ్డుకుంటున్న పోలీసులు

విజయనగరంలో....

  • విజయనగరం కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు ఉపాధ్యాయుల యత్నం, అడ్డుకున్న పోలీసులు

11:29 January 20

కడప కలెక్టరేట్‌ వద్ద ఉపాధ్యాయులను అరెస్టు చేసిన పోలీసులు

కడపలో

  • కడప కలెక్టరేట్‌ వద్ద ఉపాధ్యాయులను అరెస్టు చేసిన పోలీసులు
  • పోలీసుల వాహనాలకు ఎదురుగా ఉపాధ్యాయుల బైఠాయింపు

చిత్తూరులో

  • చిత్తూరు: గృహనిర్బంధంలోనే నిరసన చేస్తున్న ఉద్యోగ సంఘాల నేతలు
  • ఇంట్లోనే ఎస్‌టీయూ రాష్ట్ర నాయకుడు గంటా మోహన్‌ నిరాహారదీక్ష

11:07 January 20

కడప కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ఉపాధ్యాయుల యత్నం

  • కడప: కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ఉపాధ్యాయుల యత్నం
  • బారికేడ్లు తోసుకుని వెళ్తున్న ఉపాధ్యాయులు, అడ్డుకుంటున్న పోలీసులు

10:49 January 20

రాష్ట్రవ్యాప్తంగా రోడ్డెక్కిన ఉపాధ్యాయ సంఘాలు

  • రాష్ట్రవ్యాప్తంగా రోడ్డెక్కిన ఉపాధ్యాయ సంఘాలు
  • రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి
  • ఫ్యాప్టో ఆధ్వర్యంలో పీఆర్సీకి వ్యతిరేకంగా ఆందోళన
  • పీఆర్సీ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని నినాదాలు
  • రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ఉపాధ్యాయుల ఆందోళనలు
  • కలెక్టరేట్ల ప్రధాన ద్వారాల వద్ద బైఠాయించిన ఉపాధ్యాయులు
  • రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద భారీగా మోహరించిన పోలీసులు
  • కలెక్టరేట్లకు సమీపంలో బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు
  • కొన్నిచోట్ల బారికేడ్లు తోసుకుని ముందుకొచ్చిన ఉపాధ్యాయులు
  • కలెక్టరేట్ల వద్ద పోలీసులు, ఉపాధ్యాయుల మధ్య తోపులాట
  • కలెక్టరేట్లకు రాకుండా ముందస్తు అరెస్టులు చేసిన పోలీసులు
  • పోలీసులు అడ్డుకోవడంతో ఎక్కడికక్కడ రోడ్డుపైనే బైఠాయింపు
  • ఉపాధ్యాయుల అరెస్టును వ్యతిరేకిస్తూ పోలీసుస్టేషన్ల వద్ద నిరసన

10:21 January 20

విశాఖలో ఉపాధ్యాయులు, పోలీసులకు మధ్య తోపులాట

కృష్ణాలో

  • మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు
  • మచిలీపట్నం: ఉపాధ్యాయులను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్న పోలీసులు

విశాఖలో....

  • విశాఖ కలెక్టరేట్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు
  • విశాఖ: కలెక్టరేట్‌కు 100 మీటర్ల దూరంలో బారికేడ్లు ఏర్పాటు
  • విశాఖ: బారికేడ్లు తోసుకుని ముందుకొచ్చిన పోలీసులు
  • విశాఖ కలెక్టరేట్‌కు భారీగా తరలివచ్చిన ఉపాధ్యాయులు
  • విశాఖ: ఉపాధ్యాయులు, పోలీసులకు మధ్య తోపులాట
  • పీఆర్సీకి వ్యతిరేకంగా పెద్దఎత్తున ఉపాధ్యాయుల నినాదాలు

09:58 January 20

కడప కలెక్టరేట్‌కు భారీగా తరలివచ్చిన ఉపాధ్యాయులు

కడపలో

  • కడప కలెక్టరేట్‌కు భారీగా తరలివచ్చిన ఉపాధ్యాయులు
  • కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించిన ఉపాధ్యాయులు
  • పీఆర్సీకి వ్యతిరేకంగా పెద్దఎత్తున ఉపాధ్యాయుల నినాదాలు
  • కడప కలెక్టరేట్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు

విజయనగరంలో....

  • విజయనగరం కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయుల ధర్నా
  • విజయనగరం కలెక్టరేట్ వైపు వచ్చే వాహనాలు దారిమళ్లింపు
  • పీఆర్సీ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ధర్నా
  • ఉపాధ్యాయుల ఆందోళన దృష్ట్యా పోలీసుల మోహరింపు

ఒంగోలులో

  • ఒంగోలు కలెక్టరేట్‌కు భారీగా చేరుకున్న ఉపాధ్యాయులు
  • ఒంగోలు: ఫ్యాప్టో ఆధ్వర్యంలో పీఆర్సీకి వ్యతిరేకంగా ఆందోళన

అనంతపురంలో

  • అనంతపురం కలెక్టరేట్‌కు పెద్దఎత్తున చేరుకున్న ఉపాధ్యాయులు
  • అనంతపురం: ఫ్యాప్టో పిలుపు మేరకు పీఆర్సీకి వ్యతిరేకంగా ఆందోళన

విశాఖలో

  • విశాఖ కేజీహెచ్‌ ఔట్‌గేట్‌, జిల్లా పరిషత్‌ నుంచి ర్యాలీకి సిద్ధమైన ఉపాధ్యాయులు
  • విశాఖ కలెక్టరేట్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు

చిత్తూరులో..

  • చిత్తూరు కలెక్టరేట్‌ వద్ద భారీగా పోలీసుల మోహరింపు
  • కలెక్టరేట్‌కు 200 మీటర్ల దూరం నుంచి చెక్‌పోస్టులు ఏర్పాటు
  • ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులను అనుమతించని పోలీసులు

పశ్చిమ గోదావరి జిల్లాలో

  • ఎస్టీయూ నేతలు నారాయణ, పవన్‌కుమార్‌ ముందస్తు అరెస్టు
  • అరెస్టులను ఖండించిన ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు సాయి శ్రీనివాస్

కర్నూలులో

  • కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయుల ఆందోళన
  • సమస్యలు పరిష్కరించాలని ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిరసన

గుంటూరులో

  • గుంటూరు కలెక్టరేట్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు
  • గుంటూరు కలెక్టరేట్‌కు వెళ్లే మార్గాల్లో పోలీసుల తనిఖీలు

09:18 January 20

నెల్లూరు కలెక్టరేట్‌ వద్ద భారీగా మోహరించిన పోలీసులు

నెల్లూరు జిల్లాలో

  • నెల్లూరు కలెక్టరేట్‌ వద్ద భారీగా మోహరించిన పోలీసులు
  • ఉపాధ్యాయులు రాకుండా అడ్డుకుంటున్న పోలీసులు
  • పోలీసులు, ఉపాధ్యాయుల మధ్య వాగ్వాదం
  • నిరసనకు వచ్చే ఉద్యోగుల వాహనాలను అడ్డుకున్న పోలీసులు

శ్రీకాకుళం జిల్లాలో

  • శ్రీకాకుళం: యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షుడు బాబురావు గృహనిర్బంధం
  • శ్రీకాకుళం: యూటీఎఫ్ గౌరవాధ్యక్షుడు భాస్కరరావు గృహనిర్బంధం

చిత్తూరు జిల్లాలో

  • కుప్పం, పలమనేరు నుంచి చిత్తూరు వెళ్తున్న ఉపాధ్యాయుల అరెస్టు
  • బంగారుపాళ్యం సమీపంలో టోల్‌గేట్‌ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు
  • ఉద్యోగ, ఉపాధ్యాయులను ఎక్కడికక్కడే నిర్బంధిస్తున్న పోలీసులు

09:02 January 20

నెల్లూరు జిల్లా యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి జి.సుధీర్ గృహనిర్బంధం

  • నెల్లూరు: యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి జి.సుధీర్ గృహనిర్బంధం
  • నెల్లూరు: యూటీఎఫ్‌ మండల ప్రధాన కార్యదర్శి ఎ.రవి గృహనిర్బంధం

చిత్తూరులో

  • చిత్తూరు కలెక్టరేట్ ముట్టడికి వెళ్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగుల అరెస్టు
  • ఉద్యోగ సంఘాల నాయకులను గృహనిర్బంధం చేసిన పోలీసులు
  • తిరుపతిలో తితిదే ఉద్యోగ సంఘాల నాయకుల గృహనిర్బంధం
  • జిల్లా ఎస్‌టీయూ అధ్యక్షుడు జగన్, ప్రధాన కార్యదర్శి మధుసూధన్ గృహనిర్బంధం

నెల్లూరులో

  • నెల్లూరు కలెక్టరేట్ ముట్టడికి వెళ్తున్న ఉపాధ్యాయుల ముందస్తు అరెస్టు
  • ఉదయగిరి పోలీసుస్టేషన్‌ వద్ద నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులు

08:52 January 20

రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయులు

కడప జిల్లాలో

  • కడప: ప్రొద్దుటూరులో ఉపాధ్యాయులను అడ్డుకున్న పోలీసులు
  • కడప కలెక్టరేట్‌ ముట్టడికి వెళ్తుండగా కొత్తపల్లి వద్ద ముందస్తు అరెస్టులు
  • కొత్తపల్లి వద్ద రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయులు

నెల్లూరు జిల్లాలో

  • నెల్లూరు: ఆత్మకూరు, సంగం చెక్‌పోస్టుల వద్ద పోలీసుల తనఖీలు
  • నెల్లూరు: కలెక్టరేట్‌ ముట్టడికి వెళ్తున్న ఉపాధ్యాయుల ముందస్తు అరెస్టు
  • నెల్లూరు: పోలీసుస్టేషన్‌లోనే ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయులు

08:25 January 20

గృహనిర్బంధంలో పలువురు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ నేతలు

శ్రీకాకుళం జిల్లాలో

  • శ్రీకాకుళం: ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం ముందస్తు అరెస్టు

విశాఖలో

  • విశాఖలో ఏపీటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి వై.శ్రీనివాసరావు గృహనిర్బంధం

గుంటూరులో

  • గుంటూరు కలెక్టరేట్ ముట్టడికి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల పిలుపు
  • చలో కలెక్టరేట్‌కు వెళ్లకుండా ముందస్తు నోటీసులు ఇస్తున్న పోలీసులు
  • గృహనిర్బంధంలో పలువురు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ నేతలు

కడప జిల్లాలో

  • కడపలో యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీ రాజా ముందస్తు అరెస్టు
  • కడప: కలెక్టరేట్‌ ముట్టడికి పిలుపునిచ్చిన ఉపాధ్యాయుల ముందస్తు అరెస్టు

నెల్లూరులో

  • నెల్లూరు: వెంకటగిరి పోలీసుస్టేషన్‌ వద్ద ఉపాధ్యాయుల నిరసన
  • అక్రమ అరెస్టులు సరికాదంటూ నిరసన వ్యక్తం చేసిన ఉపాధ్యాయులు
Last Updated : Jan 20, 2022, 1:13 PM IST

For All Latest Updates

TAGGED:

live page

ABOUT THE AUTHOR

...view details