రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రం (ఆర్‌టీపీపీ) కోసం కొనుగోలు చేసిన బొగ్గు నిల్వలు సుమారు ఏడాదిగా వృథాగా పడి ఉన్నాయి. వీటి కొనుగోలుకు రూ.140 కోట్లను జెన్‌కో వెచ్చించింది. రవాణా ఛార్జీల రూపేణా మరో రూ.10 కోట్ల వరకు ఖర్చు చేసింది. వర్షానికి తడిచి ఎండటంవల్ల ఈ బొగ్గు నాణ్యత దెబ్బతింది. దీన్ని వినియోగిస్తే 25శాతం వరకూ ఉత్పతి తగ్గే అవకాశం ఉందని అంచనా. దానివల్ల దాదాపు రూ.40 కోట్లు నష్టపోవాల్సి వస్తుందని జెన్‌కో భావిస్తోంది.
వృథాగా బొగ్గు.. ఆర్‌టీపీపీలో భారీగా నిల్వలు - ఆర్‌టీపీపీలో భారీగా నిల్వలు
ఏడాదిగా బొగ్గు వృథాగా పడి ఉంది. ఆర్‌టీపీపీలో భారీగా బొగ్గు నిల్వలు పేరుకుపోయాయి. నాణ్యత దెబ్బతినడంతో రూ. 40 కోట్ల మేర నష్టం వస్తుందని జెన్‌కో భావిస్తోంది .దీంతో ఈ నిల్వలను ఏం చేయాలన్న దానిపై ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు.
దీంతో ఈ నిల్వలను ఏం చేయాలన్న దానిపై ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో నష్టాన్ని డిస్కంలే భరించాలని కోరుతూ జెన్‌కో ఇటీవల ఇంధనశాఖకు లేఖ రాసింది. వేసవిలో డిమాండును దృష్టిలో ఉంచుకుని విజయవాడ, కృష్ణపట్నం, ఆర్‌టీపీపీ ప్లాంట్లలో సుమారు 16 లక్షల టన్నుల బొగ్గును నిల్వ చేశారు. ఇందులో ఆర్‌టీపీపీలో 4.5 లక్షల టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. రిజర్వాయర్లు నిండటంతో శ్రీశైలం, సీలేరు కేంద్రాల నుంచి 2 నెలల పాటు విద్యుత్తు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని అంచనా. ఈ పరిణామాలతో ఆర్‌టీపీపీలో ఉత్పత్తి ఇప్పట్లో ప్రారంభమయ్యే అవకాశం లేదని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
ఇదీ చదవండి:చీరాల దళిత యువకుడి మృతి కేసు సీబీఐ దర్యాప్తునకు ఇవ్వదగినది:హైకోర్టు