దిల్లీలో ముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభమైంది. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా నేతృత్వంలో విజ్ఞాన్ భవన్‌లో సమావేశం జరుగుతోంది. మావోయిస్టు ప్రాంతాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, సమస్యలపై చర్చించనున్నారు. ఏపీ, తెలంగాణ, బంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బిహార్, యూపీ, ఎంపీ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో మావోల ప్రభావం ఎలా ఉంది? అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న విషయాలను ప్రస్తావించనున్నారు.
దిల్లీలో ముఖ్యమంత్రుల సమావేశం.. హాజరైన హోంమంత్రి సుచరిత
దిల్లీలో కేంద్రం హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో సమావేశం ప్రారంభమైంది. మావోల ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, సమస్యలపై చర్చించనున్నారు. రాష్ట్రం నుంచి హోంమంత్రి సుచరిత హాజరయ్యారు.
cms meeting in delhi
అనారోగ్య కారణాలతో సీఎం జగన్ ఈ సమావేశానికి దూరం కాగా రాష్ట్ర హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్ హాజరయ్యారు. కేసీఆర్, ఉద్ధవ్ ఠాక్రే, నితీశ్ కుమార్ , శివరాజ్ సింగ్ చౌహాన్, నవీన్ పట్నాయక్ సమావేశంలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి:lokesh on drugs: తాలిబన్ల డ్రగ్స్‌కు.. తాడేపల్లి భవంతికి ఉన్న లింకేంటి?: నారా లోకేశ్
Last Updated : Sep 26, 2021, 12:43 PM IST